ఎస్‌బీఐ బాటలో బ్యాంక్ ఆఫ్ బ‌రోడా.. ‘బరోడా తిరంగా’ పేరిట కొత్త డిపాజిట్ స్కీమ్‌

సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కి ఏడాదికి 0.50% అద‌న‌పు వ‌డ్డీ ఉంటుంది.

Updated : 16 Aug 2022 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్ బ‌రోడా ‘బ‌రోడా తిరంగా’ పేరిట డిపాజిట్ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. రెండు కాల‌వ్య‌వ‌ధుల‌పై ఈ పథకం అందుబాటులో ఉంటుంది. 444 రోజుల కాల‌వ్య‌వ‌ధి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఏడాదికి 5.75% చొప్పున‌, 555 రోజుల కాల‌వ్య‌వ‌ధి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఏడాదికి 6.00% చొప్పున వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ ప‌థ‌కం ఆగ‌స్టు 16 నుంచి డిసెంబ‌ర్ 31 వరకు అమ‌ల్లో ఉంటుంది. రూ. 2 కోట్ల కంటే త‌క్కువ డిపాజిట్ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు ఏడాదికి 0.50% అద‌న‌పు వ‌డ్డీ రేటును పొందుతారు.

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ కొత్త డిపాజిట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ ఆఫ్‌ బరోడా తెలిపింది. ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌’ సంద‌ర్భంగా ఎస్‌బీఐ కూడా ‘ఉత్స‌వ్ డిపాజిట్‌’ పేరిట ఓ డిపాజిట్‌ పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కంలో ఎస్‌బీఐ 1000 రోజుల కాల‌వ్య‌వ‌ధితో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సంవ‌త్స‌రానికి 6.10% వ‌డ్డీ రేటును అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్లకు 0.50% అద‌న‌పు వ‌డ్డీ రేటును పొందుతారు. ఈ వ‌డ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమ‌ల్లోకి వచ్చాయి. ఈ ప‌థ‌కం 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts