ఆ వీడియో నమ్మొద్దు.. హెచ్చరించిన ఎన్‌ఎస్‌ఈ

Deepfake: డిజిటల్‌ యుగంలో సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వారు ఎక్కువైపోతున్నారు. డీప్‌ఫేక్‌ వీడియోలు రూపొందించి నకిలీ సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నారు.

Published : 11 Apr 2024 00:09 IST

Deepfake | దిల్లీ: ‘డీప్‌ఫేక్‌’.. చాలా మందిని భయపెడుతున్న అంశం ఇది. ఈ సాంకేతికత దుర్వినియోగంతో రోజురోజుకీ పెరిగిపోతోంది. సామాన్యుల దగ్గర నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, దేశాధినేతల వరకు అందరూ దీని బారినపడుతున్నారు. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్‌ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ (Ashishkumar Chauhan)కు సైతం ఈ ముప్పు తప్పలేదు. పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్‌ వీడియోలు నెట్టింట బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ స్పందించింది. 

‘‘పెట్టుబడులు పెట్టాలనుకొనేవారు ఇలాంటి ఆడియో, వీడియోలు నమ్మెద్దు. నకిలీ వీడియోలు, ఇతర మాధ్యమాల నుంచి వచ్చే పెట్టుబడి సలహాలు అనుసరించొద్దు’’ అని తెలిపింది. ఇలాంటి ఫేక్‌ వీడియోలను తొలగించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించి ఎటువంటి సమాచారమైనా తమ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది.

డీప్‌ఫేక్‌ వీడియోలు గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాల వేదికగా బయటకొస్తూనే ఉన్నాయి. దీని కట్టడికి ఓ వైపు కేంద్రం చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ వీడియోల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని వీటి పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని