smartwatch: వాయిస్‌ కాలింగ్‌తో పెబల్ కొత్త వాచ్.. ధర, ఫీచర్లివే..

Pebble Game of Thrones smartwatch: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ పెబల్‌ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ పేరిట మరో వాచ్‌ను శుక్రవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Published : 26 Aug 2023 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ పెబల్‌ (Pebble) భారత్‌ మార్కెట్‌లో కొత్త వాచ్‌ తీసుకొచ్చింది. ఈ ఏడాది జులైలోనే కాస్మోగ్‌ వోగ్  (Pebble Cosmos Vogue) పేరిట వాచ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ ఇప్పుడు.. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ (Pebble Game of Thrones) పేరిట మరో స్మాట్‌వాచ్‌ను శుక్రవారం విడుదల చేసింది. 1.43 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో ఇది వచ్చింది. బ్లూటూత్‌ కాలింగ్ (BT calling) ఫీచర్‌ కూడా ఇందులో ఉంది.

పెబల్ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ.5,499 గా కంపెనీ ప్రకటించింది. నలుపు, గ్రే, గోల్డ్‌.. ఈ మూడు రంగుల్లో లభిస్తుంది. 1.43 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో గుండ్రపు ఆకారంలో ఈ వాచ్‌ ఉంటుంది. ఇందులో 250mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏడు రోజుల పాటు వస్తుందని కంపెనీ వెల్లడించింది. లెధర్‌ స్ట్రాప్స్‌తో ఈవాచ్‌లను తీసుకొచ్చారు. మ్యాగ్నెటిక్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని ఇస్తున్నారు. స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మొబైల్‌ ఫోన్‌లోని బ్లూటూత్‌ కనెక్షన్ ద్వారా ఫోన్‌కు వచ్చే కాల్స్‌ని లిఫ్ట్‌ చేసి వాచ్‌లో అమర్చిన మైక్రోఫోన్ సాయంతో ఫోన్‌ మాట్లాడొచ్చు. 

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

ఇందులో SpO2, హార్ట్‌రేట్‌, స్లీప్‌ మానిటరింగ్‌ వంటి హెల్త్‌ ట్రాకర్స్‌ ఉన్నాయి. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌, ఫిట్‌నెస్‌ యాక్టివిటీ ట్రాకర్లను కూడా ఇచ్చారు. వీటితో పాటు కాలిక్యులేటర్ యాప్, అలారం క్లాక్‌, స్టాప్‌వాచ్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. నీరు, దుమ్ము చేరకుండా IP67 రేటింగ్‌ను ఈ వాచ్‌కు ఇచ్చారు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ రెండిటికీ ఈ వాచ్‌ సపోర్ట్‌ చేస్తుందని పెబల్ వెల్లడించింది. పెబల్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ వెబ్‌సైట్‌ సాయంతో వీటిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని