Realme Narzo 70 Pro: ఎయిర్‌ గెశ్చర్స్‌ ఫీచర్‌తో రియల్‌మీ నార్జో 70 ప్రో

Realme Narzo 70 Pro 5G: రియల్‌మీ సంస్థ నార్జో 70 ప్రోను లాంచ్ చేసింది. దీని ధరను రూ.18,999గా నిర్ణయించింది. మార్చి 22 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Updated : 19 Mar 2024 16:22 IST

Realme Narzo 70 Pro | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన నార్జో సిరీస్‌లో నార్జో 70 ప్రో 5జీని (Realme Narzo 70 Pro) లాంచ్‌ చేసింది. రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌, ఎయిర్‌ గెశ్చర్స్‌ వంటి కొత్త ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు. ఇంతకీ ఈ ఫీచర్లు ఎలా పని చేస్తాయ్‌? ఈ ఫోన్‌ ధరెంత? వంటి వివరాలు చూద్దాం.

రియల్‌మీ నార్జో 70 ప్రో స్మార్ట్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8 జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా పేర్కొంది. మార్చి 22 నుంచి అమెజాన్‌, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోళ్లపై డిస్కౌంట్‌ ఇస్తున్నారు. మార్చి 19 సాయంత్రం 6 గంటల నుంచి ఎర్లీ బర్డ్‌ సేల్‌ ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో రియల్‌మీ టీ300 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. 

Post office: ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. వర్చువల్‌గా మరో 8జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ ఐ యూఐ 5.1తో పనిచేస్తుంది. గ్లాస్‌ గ్రీన్‌, గ్లాస్‌ గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది.

వెనకవైపు నార్జో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 890 సెన్సర్‌ను అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 67W సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఎయిర్‌ గెశ్చర్స్‌ ఫీచర్‌లో భాగంగా స్క్రీన్‌ షాట్‌ తీయడం, ఇన్‌స్టా రీల్స్‌ పైకి మూవ్‌ చేయడం వంటి 10 రకాల గెశ్చర్స్‌ను స్మార్ట్‌ఫోన్‌ను తాకకుండానే చేయొచ్చు. తడి చేత్తోనూ ఫోన్‌ డిస్‌ప్లేను ఆపరేట్‌ చేయడానికి వీలుగా రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ను ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని