Jio Smart Home Services: ఎంటర్‌టైన్‌మెంట్‌లో సరికొత్త విప్లవం.. జియో స్మార్ట్‌హోమ్‌

ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలకు ఆల్‌-ఇన్‌-ఇన్‌ సొల్యూషన్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌లో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో జియో మరో కొత్త సర్వీస్‌ను తీసుకొస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఆకాశ్‌ అంబానీ తెలిపారు.

Published : 28 Aug 2023 18:50 IST

ముంబయి: రిలయన్స్‌ 46వ వార్షిక సాధారణ సమావేశం (Reliance AGM)లో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో భాగంగా వినాయక చవితికి రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్‌ను (Jio Airfiber) వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో మరో కొత్త సర్వీస్‌ను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు జియో ఛైర్మన్ ఆకాశ్‌ అంబానీ (Akash Ambani) తెలిపారు. జియో స్మార్ట్‌హోమ్ సర్వీసెస్ (Jio Smart Home Services) పేరుతో తీసుకురాబోయే ఈ సర్వీస్‌లో భాగంగా యూజర్లు జియో సెటాప్‌ బాక్స్‌ (Jio Set-Top బాక్స్‌), 5జీ హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌తో జియో ఎయిర్‌ఫైబర్‌ పొందుతారు. వీటిని స్మార్ట్‌ హోమ్‌ యాప్‌ (Smart Home App) సాయంతో నియంత్రించవచ్చు. 

ఇందులోనే జియో సెటాప్‌బాక్స్‌కు ఎలక్ట్రానిక్‌ రిమోట్‌ ఉంటుంది. దాంతోపాటు ఇంట్లోని స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ను యాప్‌కు కనెక్ట్‌ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఈ యాప్‌ ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలకు ఆల్‌-ఇన్‌-ఇన్‌ సొల్యూషన్‌గా పనిచేస్తుంది. కొత్తగా తీసుకొస్తున్న సెటాప్‌బాక్స్ ద్వారా టీవీ ఛానెల్స్‌, ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ యాప్‌లతోపాటు గేమింగ్‌ వంటివి సర్వీసులు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. జియో సినిమా, జియో టీవీ+లతోపాటు అన్ని రకాల అంతర్జాతీయ స్ట్రీమింగ్‌ యాప్‌లను సెటాప్‌బాక్స్‌ సపోర్ట్‌ చేస్తుంది. 

రిలయన్స్‌ బోర్డులోకి ముకేశ్‌ అంబానీ వారసులు

జియో స్మార్ట్‌ హోమ్‌ సర్వీస్‌ హోమ్ మేనేజ్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడంతోపాటు, వినియోగదారులకు మెరుగైన ఎంటర్‌టైన్‌మెంట్‌ అనుభూతిని అందిస్తుందని జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. ‘‘భారత్‌లో 80 శాతం డేటాను ఇంట్లో ఉండేవారే ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెసిన తర్వాత నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అందుకే వారిని అలరించేందుకు, ఎంటర్‌టైన్‌మెంట్‌లో సరికొత్త అనుభూతిని అందించేందుకు జియో స్మార్ట్‌ హోమ్‌ సర్వీసెస్‌ను పరిచయం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టైన్‌ మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ ధోరణి అందుకోవాలనే ఉద్దేశంతో జియో సెటాప్‌బాక్స్‌ను తీసుకొస్తున్నాం. దీంతో యూజర్లు ప్రపంచంలోని అన్ని రకాల స్ట్రీమింగ్‌ యాప్‌లతోపాటు జియోకు సంబంధించిన అన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ సేవలను  పొందొచ్చు’’ అని ఆకాశ్‌ అంబానీ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని