Jioలో ప్రత్యేక డేటా ప్యాక్‌.. రూ.148తో 12 OTTలు.. 10జీబీ డేటా

Jio: ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రిలయన్స్‌ జియో ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొస్తోంది.

Published : 04 Jan 2024 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్‌ జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి.

జియో రూ.148 ప్లాన్‌ కేవలం డేటా ప్యాక్‌ మాత్రమే. వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్‌ ప్లాన్ ఉండాల్సిందే. సోనీలివ్‌, జీ5, జియోసినిమా ప్రీమియం, డిస్కవరీ+, లయన్స్‌గేట్‌, సన్‌నెక్ట్స్‌ సహా మొత్తం 12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఇవన్నీ జియో టీవీ ప్రీమియంలో భాగంగా వీక్షించొచ్చు. మరోవైపు జియో సినిమా ప్రీమియం కూపన్‌ మైజియో అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. సింగిల్‌ ప్లాన్‌పై 14 ఓటీటీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు