Samsung Smart TV: వీడియో కాలింగ్‌తో శామ్‌సంగ్‌ క్రిస్టల్‌ స్మార్ట్‌ టీవీ.. ధర, ఫీచర్లివే..!

Samsung Crystal 4K iSmart UHD TV: శామ్‌సంగ్‌ భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌ టీవీని విడుదల చేసింది. దీని ధర రూ.33,990 నుంచి ప్రారంభమవుతోంది.

Published : 19 May 2023 11:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శామ్‌సంగ్‌ భారత్‌లో ‘క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ 2023 (Samsung Crystal 4K iSmart UHD TV)’ని విడుదల చేసింది. 43 అంగుళాలతో మొదలుకొని వివిధ స్క్రీన్‌ సైజ్‌లలో ఇది అందుబాటులో ఉంది. బ్రైట్‌నెస్‌ను పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే ఐఓటీ ఆధారిత సెన్సర్లు ఉన్నాయి. ఇది టైజెన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, క్రిస్టల్‌ టెక్నాలజీతో వస్తోంది. క్యూ-సింఫనీ, ఓటీఎస్‌ లైట్‌, అడాప్టివ్‌ సౌండ్‌ టెక్నాలజీ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ ధర..

43 అంగుళాల స్క్రీన్‌ వస్తున్న Samsung Crystal 4K iSmart UHD TV ధర భారత్‌లో రూ.33,990. 65 అంగుళాల స్క్రీన్‌తో వస్తున్న టీవీ ధర రూ.71,990. ధరను 12 నెలల పాటు EMI ద్వారా చెల్లించే వెసులుబాటును కూడా శామ్‌సంగ్‌ కల్పిస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, శామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది.

క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ ఫీచర్లు..

Samsung Crystal 4K iSmart UHD TVలో ఉన్న క్రిస్టల్‌ టెక్నాలజీ తక్కువ రెజల్యూషన్‌ కంటెంట్‌ను మెరుగ్గా చూపించగలదు. అలాగే రంగులను సైతం కంటికి ఇంపుగా మార్చగలదని కంపెనీ తెలిపింది. పిక్చర్‌ పెర్ఫార్మెన్స్‌ను ఆప్టిమమ్‌గా మార్చే ‘పర్‌కలర్‌ సపోర్ట్‌’ కూడా ఉన్నట్లు వెల్లడించింది. స్లిమ్‌ఫిట్‌ కెమెరాతో వీడియో కాలింగ్‌ ఫీచర్‌ కూడా ఉన్నట్లు శామ్‌సంగ్‌ తెలిపింది. ఈ టీవీలోనే ఐఓటీ హబ్‌ను బిల్ట్‌-ఇన్‌గా ఇస్తోంది. దీనికి కామ్‌ ఆన్‌బోర్డింగ్‌ ఫీచర్‌ను కూడా జత చేసింది. ఈ ఫీచర్‌ వల్ల పరిసరాల్లో ఉన్న శాంసంగ్‌ డివైజ్‌లతో పాటు థర్డ్‌ పార్టీ అప్లయనెన్స్‌ను కూడా కంట్రోల్‌ చేయొచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌ సహా ఇతర ఆప్షన్లను ఒకే దగ్గరకు తీసుకొచ్చే స్మార్ట్‌ హబ్‌ ఫీచర్‌ కూడా ఈ Crystal 4K iSmart UHD TVలో ఉంది. టైజెన్‌ ఓఎస్‌తో వస్తున్న ఈ టీవీ.. కంపెనీ అందిస్తోన్న యాడ్‌-సపోర్ట్‌ టీవీ, 100 ఛానెళ్లకు పైగా అందించే వీడియో ఆన్‌ డిమాండ్‌ సర్వీస్‌తో కూడిన శామ్‌సంగ్‌ టీవీ ప్లస్‌కు యాక్సెస్‌ను ఇస్తుంది. గేమింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచేలా ఆటో గేమ్‌ మోడ్‌, మోషన్‌ యాక్సిలరేటర్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు