Samsung Galaxy A14: 5,000mAh బ్యాటరీతో శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ14 ఫోన్‌

Samsung Galaxy A14: శామ్‌సంగ్‌ భారత్‌లో మరో 4జీ ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఏ14గా వస్తున్న ఈ ఫోన్‌ ధర రూ.13,999.

Updated : 23 May 2023 10:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ14 (Samsung Galaxy A14) 4జీ ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. ఈ కొత్త బడ్జెట్‌ ఫోన్‌.. ఎగ్జినోస్‌ 850 ప్రాసెసర్‌తో వస్తోంది. 4జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌ ఉంది. గెలాక్సీ ఏ13కు కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత వన్‌ యూఐ5పై పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని పొందుపర్చారు.

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ14 (Samsung Galaxy A14) బేస్‌ వేరియంట్‌ 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ ధర భారత్‌లో రూ.13,999. 4జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,999. బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ కేవలం కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే విక్రయానికి ఉంది. ఎస్‌బీఐ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.1,000 రాయితీ ఇస్తోంది. మరి ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఎప్పుడు విక్రయానికి వస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఈ ఫోన్‌ (Samsung Galaxy A14)లో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ (1,080x2,408 pixels) పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తోంది. రెండేళ్ల వరకు ఓఎస్‌ అప్‌గ్రేడ్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు వస్తాయి. ఇందులో ఉన్న 4జీబీ ర్యామ్‌ను 8జీబీ వరకు విస్తరించుకోవచ్చు. వెనుక భాగంలో 50 ఎంపీ, ముందు 13 ఎంపీ కెమెరా ఉంది. 128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే 4జీ, వైఫై, బ్లూటూత్‌ వీ5.1, జీపీఎస్‌, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఉన్నాయి. యాక్సెలరోమీటర్‌, జియోమ్యాగ్నెటిక్‌ సెన్సర్‌, లైట్‌ సెన్సర్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, సైడ్‌- మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని