SBI MF: మార్కెట్లో రెండు సరికొత్త ఇండెక్స్ ఫండ్లు!

ఈ 2 పండ్స్‌కు అవ‌స‌ర‌మైన క‌నీస పెట్టుబ‌డి రూ. 5000.

Updated : 21 Sep 2022 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్.. ఎస్‌బీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, ఎస్‌బీఐ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 అనే 2 ఇండెక్స్ ఫండ్లు ప్రారంభించింది. ఇవి ఓపెన్‌-ఎండెడ్‌ ప‌థ‌కాలు. ఈ ఫండ్లకు హ‌ర్ష్ సేథి మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న వృద్ధిని కోరుకునే పెట్టుబ‌డిదారుల‌కు ఈ ప‌థ‌కాలు అనుకూలంగా ఉంటాయ‌ని ఫండ్ హౌస్ తెలిపింది. ముఖ్యంగా దీర్ఘ‌కాల సంప‌ద సృష్టి కోసం మొద‌టిసారిగా ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేవారు.. వారి రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఈ ఫండ్ల‌ను పరిశీలించవచ్చు.

ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ. 5000. త‌ర్వాత రూ. 1 గుణిజాల‌లో రోజువారీ, త్రైమాసిక‌, అర్ధ వార్షిక‌ లేదా వార్షికంగా సిప్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఫండ్లో సమకూర్చిన మొత్తాన్ని ఫండ్ మేనేజర్, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్‌, నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 250 ఇండెక్స్ ప‌రిధిలో ఉన్న సెక్యూరిటీల‌లో క‌నీసం 95%, గ‌రిష్ఠంగా 100% పెట్టుబ‌డిగా పెడ‌తారు. మ‌నీ మార్కెట్ సాధ‌నాలైన యూనిట్ల‌లో, లిక్విడ్ మ్యూచువ‌ల్ ఫండ్లలో 5% వ‌ర‌కు పెట్టుబ‌డి పెడ‌తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని