Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు..!

దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

Published : 17 Aug 2023 09:26 IST

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం 9.17 సమయంలో సెన్సెక్స్‌ 38 పాయింట్లు కుంగి 65,501 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు కోల్పోయి 19,453 వద్ద ట్రేడవుతున్నాయి. గ్రావిట్‌ ఇండియా, హెచ్‌ఎల్‌ఈ గ్లాస్‌కోట్‌, ఐనాక్స్‌ విండ్‌, పీటీసీ ఇండస్ట్రీస్‌, తేజస్‌ నెట్‌వర్క్‌ షేర్లు భారీగా విలువ పెరగ్గా.. లాయిడ్‌ ఇంజినీరింగ్‌, నావా.ఎల్‌, ఇండియన్‌ రైల్వే ఫినాన్స్‌, గ్లోబస్‌ స్పిరిట్‌, కాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌ షేర్లు నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు కుంగి 82.99 వద్ద మొదలైంది. 

అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో బుధవారం నాటి ట్రేడింగ్‌ను ముగించాయి. డోజోన్స్‌ 0.5, నాస్‌డాక్‌ 1.15, ఎస్‌అండ్‌పీ-500 సూచీ 0.7శాతం నష్టపోయాయి. ఈ ప్రభావం ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లపై పడింది. ఒక్క చైనా, తైవాన్‌ సూచీలు మినహా మిగిలిన ప్రధాన సూచీలు మొత్తం నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జపాన్‌ సూచీ నిక్కీ 0.9శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.82శాతం కుంగాయి. షాంఘై కాంపోజిట్‌ స్వల్పలాభాల్లో ట్రేడవుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని