Simple Dot One: సింపుల్ వన్‌ నుంచి కొత్త స్కూటర్‌.. సింగిల్ ఛార్జ్‌తో 152KM

Simple Dot One: విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సింపుల్‌ ఎనర్జీ తన వాహన శ్రేణిలో రెండో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర, ఫీచర్లు, రేంజ్‌ వివరాలు ఇవే..

Published : 15 Dec 2023 18:42 IST

Simple Dot One | ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్ స్కూటర్ల తయారీ స్టార్టప్‌ సింపుల్‌ ఎనర్జీ (Simple Energy) తన వాహనశ్రేణి రెండో స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో సింపుల్ వన్‌ పేరుతో ఒక స్కూటర్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ.. తాజాగా సింపుల్‌ డాట్‌ వన్‌ (Simple Dot One)ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. దీని ధర రూ.99,999 (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ప్రీ బుకింగ్ కస్టమర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త ధరను జనవరిలో ప్రకటించనున్నారు.

స్విగ్గీ యూజర్‌కు వింత అనుభవం.. ఒకే ఆర్డర్‌ ఆరుసార్లు డెలివరీ!

సింగిల్‌ వేరియంట్‌లో నమ్మ రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ రంగుల్లో ఈ స్కూటర్‌ లభిస్తుంది. ఇందులో 3.7kWh బ్యాటరీ, 8.5 kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అమర్చారు. 72 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌ 2.7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 152 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని పేర్కొంది. యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌, సీబీఎస్‌ డిస్క్‌ బ్రేక్‌లు, 35 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. 7 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్ కనెక్లివిటీ కూడా ఉంది. అయితే, ఎప్పటి నుంచి ఈ స్కూటర్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్న విషయాన్ని మాత్రం కంపెనీ చెప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు