Ola Scooter: త్వరలో ఓలా మూవ్‌ఓఎస్‌లో అప్‌డేట్‌.. కొత్తగా కన్సర్ట్‌ మోడ్‌

Ola Scooter: కన్సర్ట్‌ మోడ్‌ వల్ల స్కూటర్‌లో ఉన్న లైట్లన్నీ మ్యూజిక్‌కి అనుగుణంగా బ్లింక్‌ అవుతాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ కొత్త రాబోయే ఓఎస్‌లో ఇవ్వనున్నట్లు

Updated : 05 Apr 2023 17:16 IST

బెంగళూరుః విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) మరో అప్‌డేట్‌ తీసుకొస్తోంది. తమ ఈవీల్లోని ‘మూవ్‌ఓఎస్‌’కు త్వరలోనే నాలుగో అప్‌డేట్‌ (moveOS4)ను అందించనుంది. పలు కీలక మార్పులు జత చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి కన్సర్ట్‌ మోడ్‌ (Concert Mode). మూడో అప్‌డేట్‌లో ఇచ్చిన ‘పార్టీ మోడ్‌’కు అడ్వాన్స్‌గా దీన్ని తీసుకొస్తోంది. ఈ విషయాన్ని  కంపెనీ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఇది ఎలా ఉండబోతోందో తెలియజేసే వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.

కన్సర్ట్‌ మోడ్‌ వల్ల స్కూటర్‌లో ఉన్న లైట్లన్నీ మ్యూజిక్‌కి అనుగుణంగా బ్లింక్‌ అవ్వడం వీడియోలో గమనించవచ్చు. అలా అనేక స్కూటర్లను ఒక దగ్గరకు చేర్చి కన్సర్ట్‌ మోడ్‌ను ఆన్‌ చేసి మ్యూజిక్‌ను ప్లే చేశారు. దీంతో మ్యూజిక్‌కి అనుగుణంగా లైటింగ్‌ బ్లింక్‌ అవుతుండడంతో ప్రత్యేక అనుభూతి కలుగుతున్నట్లు భవీష్‌ అన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఇలాంటి ఫీచర్‌ కొత్తేమీ కాదు. టెస్లా కార్లలో ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇటీవలే ఆస్కార్‌ గెలుచుకున్న  తెలుగు పాట ‘నాటు నాటు’ బీట్‌కు అనుగుణంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులు టెస్లా కార్లతో ఇచ్చిన లైట్ల ప్రదర్శన ఇలాంటి ఫీచర్‌ వల్లే సాధ్యమైంది.
(Also Read: 150 టెస్లా కార్లతో ‘నాటు నాటు’.. ప్రవాసాంధ్రుల అద్భుత ప్రదర్శన)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని