Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు..

Stock Market Opening Bell: స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 72,300 మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 22వేల మైలురాయిని సమీపించింది.

Published : 07 Feb 2024 09:39 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock Market)లో లాభాల పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా దిగ్గజ షేర్లు రాణించడం వీటికి కలిసొచ్చింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌ను మార్కెట్లు ఉత్సాహంగా మొదలుపెట్టాయి. ఆరంభంలో నిఫ్టీ 22వేల మార్క్‌ పైన కదలాడింది.

ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 154.47 పాయింట్లు లాభపడి 72,340.56 వద్ద, నిఫ్టీ (Nifty) 53.75 పాయింట్ల లాభంతో 21,983.15 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి 83.03 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు రాణిస్తుండగా.. భారత్‌ పెట్రోలియం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, విప్రో షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ 0.4శాతం, ఎస్‌ అండ్‌ పీ సూచీ 0.2శాతం, నాస్‌డాక్‌ 0.1శాతం మేర లాభపడ్డాయి. అటు జపాన్‌ మినహా ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు రాణిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.61శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.4శాతం, దక్షిణ కొరియా కోస్పి  1.4శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్‌ నిక్కీ మాత్రం 0.11శాతం మేర కుంగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని