Stock Market: స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం సెలవు నేపథ్యంలో సూచీలు శనివారం పనిచేస్తున్నాయి.

Updated : 20 Jan 2024 10:04 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు శనివారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగానే ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం కాస్త ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఆరంభంలో 250 పాయింట్ల పైన ట్రేడ్‌ అయిన సెన్సెక్స్‌ (Sensex).. ఉదయం 9.30 గంటల సమయంలో 123 పాయింట్ల లాభంతో 71,806 వద్ద కొనసాగుతోంది. 

అటు నిఫ్టీ (Nifty) 40 పాయింట్ల లాభంతో 21,662 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హిందుస్థాన్‌ యునిలివర్‌, విప్రో, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

సాధారణంగా స్టాక్‌ మార్కెట్లకు శనివారం సెలవు ఉంటుంది. కానీ ఈ రోజు పనిచేస్తాయని ఎక్స్ఛేంజీలు తెలిపాయి. దీనికి బదులుగా సోమవారం నాడు (22న) సెలవు ప్రకటించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించడమే ఇందుక్కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని