Swiggy Access: క్లౌడ్ కిచెన్ వ్యాపారానికి స్విగ్గీ గుడ్‌బై
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా క్లౌడ్ కిచెన్ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని స్విగ్గీ నిర్ణయించింది. ఈ మేరకు తమ స్విగ్గీ యాక్సెస్‌ను కిచెన్స్@కు విక్రయించింది.
దిల్లీ: వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ (Swiggy) కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్లౌడ్ కిచెన్ వ్యాపారం స్విగ్గీ యాక్సెస్ (Swiggy Access)ను కిచెన్స్@ (Kitchens@)కు విక్రయించినట్లు వెల్లడించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా స్విగ్గీ (Swiggy) ఇప్పటికే 380 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
తమ అంచనాలకు అనుగుణంగా వ్యాపార వృద్ధి కొనసాగడం లేదని స్విగ్గీ (Swiggy) సీఈఓ, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష తెలిపారు. ఈ నేపథ్యంలో లాభదాయకతపై ప్రభావం చూపుతున్న పరోక్ష ఖర్చులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మౌలిక వసతులు, ఆఫీసు స్థలాలు, సదుపాయాల విషయంలో ఖర్చులను నియంత్రించే చర్యల్ని చేపట్టినట్లు గుర్తుచేశారు.
స్విగ్గీ యాక్సెస్ (Swiggy Access) 2017లో ప్రారంభమైంది. ఫుడ్ డెలివరీకి గిరాకీ ఉండి రెస్టరెంట్లు లేని ప్రాంతాల్లో ప్రత్యేకంగా డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఈ వ్యాపార లక్ష్యం. ఈ కేంద్రాల్లో ఆయా రెస్టరెంట్లు తమ కిచెన్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రెస్టరెంట్లకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవకాశం ఏర్పడింది. 2017- 19 మధ్య స్విగ్గీ (Swiggy) ఈ వ్యాపారంపై రూ.175 కోట్లు పెట్టుబడి పెట్టింది. మరో రూ.75 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ప్రకటించింది. అలాగే 14 నగరాల్లో దాదాపు 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సైతం కొనుగోలు చేసింది. కానీ, కరోనా సంక్షోభంతో ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ప్రస్తుతం కేవలం నాలుగు నగరాల్లో మాత్రమే స్విగ్గీ యాక్సెస్ (Swiggy Access) కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
తాజా ఒప్పందం పూర్తయిన తర్వాత కిచెన్స్@లో స్విగ్గీ (Swiggy) వాటాదారుగా మారనుంది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ (Swiggy) రూ.3,628.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్‌డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్‌లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్‌కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్‌వే ఇంటర్‌మీడియర్‌లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్‌కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM