Tata Motors: పాసింజర్‌ వాహనాలు ధరలు పెంచిన టాటా

Tata Motors hikes passenger vehicle prices: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ పాసింజర్‌ వాహన ధరలను సవరించింది.

Published : 09 Jul 2022 14:44 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata Motors) పాసింజర్‌ వాహన ధరలను సవరించింది. పెంపు నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో అన్ని పాసింజర్‌ వాహనాలపై 0.55 శాతం చొప్పున ధరలు పెరగనున్నాయి. వేరియంట్‌, మోడల్‌ బట్టి ధరల పెంపుదలలో తేడా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ధరల పెంపు నిర్ణయం తీసుకునే ముందు ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని కంపెనీ తెలిపింది. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ఓ వైపు ఉత్పత్తి వ్యయం పెరిగినా వినియోగదారులపై స్వల్ప భారం పడేలా చూశామని వివరించింది. పంచ్‌, నెక్సాన్‌, హ్యారియర్‌, సఫారీ పేరిట ప్రయాణికుల వాహనాలను టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది. మరోవైపు ఇటీవలే తన కమర్షియల్‌ వాహనాల ధరలను 1.5 నుంచి 2.5 శాతం మేర టాటా మోటార్స్ పెంచింది. నెల వ్యవధిలోనే ప్రయాణికుల వాహనాల ధరలను కూడా పెంచడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని