TATA Motors: సఫారీ, హారియర్‌కు భారత్‌ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్‌ రేటింగ్‌

భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌-ఎన్‌క్యాప్‌) కింద పెద్దవాళ్లు, పిల్లల భద్రతకు సంబంధించి 5 స్టార్‌ రేటింగ్‌ను పొందిన వాహనాలుగా తమ ఎస్‌యూవీలు సఫారీ, హారియర్‌ నిలిచాయని టాటా మోటార్స్‌ తెలిపింది.

Updated : 21 Dec 2023 13:17 IST

దిల్లీ: భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌-ఎన్‌క్యాప్‌) కింద పెద్దవాళ్లు, పిల్లల భద్రతకు సంబంధించి 5 స్టార్‌ రేటింగ్‌ను పొందిన వాహనాలుగా తమ ఎస్‌యూవీలు సఫారీ, హారియర్‌ నిలిచాయని టాటా మోటార్స్‌ తెలిపింది. వాహనాల భద్రత పనితీరును మదింపు చేసి రేటింగ్‌ ఇచ్చేందుకు స్వతంత్రతతో కూడిన వ్యవస్థగా భారత్‌-ఎన్‌క్యాప్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ప్రారంభించింది. ‘అత్యుత్తమ శ్రేణి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌-ఎన్‌క్యాప్‌ ఉంది. తప్పనిసరి నియంత్రణ నిబంధనలతో పాటు అధునాతన రహదారి భద్రత, వాహన భద్రత ప్రమాణాల ఆధారంగా భారత్‌ ఎన్‌క్యాప్‌ వాహన రేటింగ్‌ వ్యవస్థను రూపొందించార’న్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలను టాటా మోటార్స్‌ గుర్తు చేసింది. ‘అత్యధిక రేటింగ్‌ అయిన 5 స్టార్‌ను పొందిన తొలి వాహనాలు రెండూ టాటా మోటార్స్‌ నుంచే ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది. ఇందుకు వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నామ’ని గడ్కరీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని