Motor insurance: వాహన బీమా రెన్యువల్ చేసే ముందు ఇవి తెలుసుకోండి..
ప్రస్తుత బీమా సంస్థతో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎన్‌సీబీని కోల్పోకుండానే మెరుగైన ప్రయోజనాలను అందించే వేరొక బీమా సంస్థకు పునరుద్ధరణ సమయంలో మారొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: వాహనాలు మన రోజువారీ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రతి రోజూ ఏదో ఒక పని మీద వాహనం బయటకు తీయడం అలవాటైపోయింది. కాబట్టి అనుకోని ప్రమాదాల వల్ల వాహనాలు డ్యామేజీ అయితే పరిహారం వచ్చేలా ఎప్పుడు బీమాను మనుగడలో ఉంచుకోవడం మంచిది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనదేశంలో ప్రతి వాహనానికీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ తప్పనిసరి. దీంతోపాటు సమగ్ర బీమాను తీసుకోవడం మంచిది. వాహన బీమాను ఇతర ఇన్సురెన్స్‌ల మాదిరిగానే గడువుకు ముందే పునరుద్ధరించాలి. ఒకరోజు ఆలస్యమైనా అధిక నష్టం రావచ్చు.
ఇస్యూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ(IDV)..
మోటారు బీమాలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాహనం పూర్తిగా నష్టపోయినప్పుడు లేదా దొంగిలించినప్పుడు బీమా సంస్థ నుంచి మీరు పొందే గరిష్ఠ బీమా విలువనే ‘ఐడీవీ’ అంటారు. ఇది ప్రీమియంపై నేరుగా ప్రభావం చూపుతుంది. తక్కువ ప్రీమియంతో ఐడీవీ కూడా తక్కువగానే ఉండొచ్చు. దీంతో క్లెయిం సమయంలో అవసరమైన మొత్తం అందదు. అందువల్ల పునరుద్ధరణ సమయంలో తక్కువ ప్రీమియంకు ఆకర్షితులై, తక్కువ ఐడీవీ ఉన్న పాలసీకి మారడం మంచిది కాదు.
నో-క్లెయిం బోనస్..
పాలసీ కాలవ్యవధిలో ఎలాంటి క్లెయింలు చేయనివారు నో-క్లెయిం బోనస్ పొందేందుకు అర్హులు. ప్రతి క్లెయిం రహిత సంవత్సరానికి బీమా సంస్థ మీకు ఎన్‌సీబీ రివార్డు అందజేస్తుంది. భారత్‌లోని జనరల్ ఇన్సురెన్స్ సంస్థలు.. వరుసగా 5 సంవత్సరాల పాటు ఎటువంటి క్లెయింలు చేయకపోతే గరిష్ఠంగా 50% డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఏదైనా ఏడాది క్లెయిం చేసినట్లయితే పునరుద్ధరణ సమయంలో మీ నో-క్లెయిం బోనస్ జీరో అయిపోతుంది. అందువల్ల పునరుద్ధరించేటప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ మరో ముఖ్య విషయం గుర్తు పెట్టుకోవాలి. నో-క్లెయిం బోనస్ డిస్కౌంట్ టీపీ (థర్డ్ పార్టీ బీమా)పై వర్తించదు. కేవలం ఓన్ డ్యామేజ్ ప్రీమియంపై మాత్రమే వర్తిస్తుంది. మొత్తం ప్రీమియంలో ఓడీ, టీపీ రెండు కలిపి ఉంటాయి. ఉదాహరణకు మీ పాలసీ ప్రీమియం రూ.1000 అనుకుందాం. అందులో టీపీ ప్రీమియం రూ.400, ఓడీ ప్రీమియం రూ.600 అనుకుంటే.. ఓడీ ప్రీమియం రూ.600 పైన మాత్రమే నో-క్లెయిం బోనస్ రాయితీ ఇస్తారు.
నెట్‌వర్క్ గ్యారేజీలు..
మోటారు బీమా సంస్థలు నగదు రహిత క్లెయిం సెటిల్‌మెంట్లను అందిస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న గ్యారేజీలతో టై-అప్ చేసుకుంటున్నాయి. వీటినే నెట్‌వర్క్ గ్యారేజీలు అంటారు. వాహనం రిపేర్లను నెట్‌వర్క్ గ్యారేజీల వద్ద చేయిస్తే బిల్లును బీమాసంస్థలు గ్యారేజీలకు నేరుగా చెల్లిస్తాయి. పాలసీ నిమయ నిబంధనలను అనుసరించి (పాలసీదారుడు వాటా చెల్లింపులు మినహా) బిల్లు మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. కాబట్టి పునరుద్ధరణ సమయంలో నెట్‌వర్క్ గ్యారేజీలను పరిశీలించడం మంచిది.
యాడ్-ఆన్‌లు..
వాహన బీమాకు యాడ్-ఆన్ జోడించడం వల్ల స్టాండర్డ్ కవర్‌తోపాటు, మీ వాహనానికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఇంజన్ ప్రొటక్షన్, జిరో డిప్రిసియేషన్, నో-క్లెయిం బోనస్ ప్రొటక్షన్, ఇన్‌వాయిస్ కవర్ రిటర్న్ వంటి యాడ్-ఆన్‌లను జోడించడం వల్ల వాహన బీమా విలువ పెరుగుతుంది. అలాగే 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, లాక్, కీ-రీప్లేస్‌మెంట్ కవర్, యాక్సిడెంటల్ షీల్డ్ వంటి యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉన్నాయి. పాలసీదారులు పునరుద్ధరణ సమయంలో ప్రయోజనాన్ని చేకూర్చే యాడ్-ఆన్‌లను జోడించవచ్చు.
నియమ నిబంధనలు..
పాలసీలో తప్పులను నివారించేందుకు పునరుద్ధరణ సమయంలో పాలసీ నియమ నిబంధనలను చదవండి. చిన్న చిన్న తప్పులు కూడా క్లెయిం సమయంలో సమస్యగా మారొచ్చు. అలాగే ప్రస్తుత బీమా సంస్థతో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎన్‌సీబీని కోల్పోకుండానే మెరుగైన ప్రయోజనాలను అందించే వేరొక బీమా సంస్థకు పునరుద్ధరణ సమయంలో మారొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ
-
Ap-top-news News
Andhra News: మామూళ్లు ఇస్తే కోరిన వేతనం.. ఆయుష్ కాంపౌండర్లకు వాట్సప్ సందేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి
-
India News
Pathaan: ‘పఠాన్’ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు
-
Ts-top-news News
Hyderabad: సరదా తెచ్చిన సమస్య.. కాపాడిన తిరుమలగిరి పోలీసులు