Volvo: జనవరి నుంచి పెరగనున్న వోల్వో కార్ల ధరలు

Volvo Car price hike : వోల్వో కార్‌ ఇండియా తన కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.

Published : 14 Dec 2023 18:34 IST

Volvo Car price hike | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్‌ ఇండియా (Volvo Car India) తన కార్ల ధరల్ని పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2024 జనవరి 1 నుంచి వోల్వో కార్ల ధరలు రెండు శాతం మేర పెరుగుతాయని అందులో పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితులు, ముడి సరకు ధరలు పెరగడం, విదేశీ మారకం విలువల్లో హెచ్చుతగ్గులు కారణంగా కార్ల ధరల్ని పెంచే నిర్ణయం తీసుకున్నట్లు వోల్వో కార్‌ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఆడి, మెర్సిడెస్‌ బెంజ్ వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు