Whatsapp: వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌కు కొత్త అప్‌డేట్‌.. ఫీచర్లు ఇవే..!

Whatsapp Desktop app: వాట్సాప్‌ కొత్త డెస్క్‌టాప్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు 32 మందితో ఆడియో కాల్స్‌ చేసుకోవచ్చు. 8 మందితో వీడియో కాల్స్‌లో సంభాషించొచ్చు.

Updated : 23 Mar 2023 19:14 IST

Whatsapp desktop | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను (Whatsapp) మొబైల్‌లో వాడే వారే అధికం. అయితే, నిత్య జీవితంలో భాగమయ్యాక ఆఫీసు సమయాల్లోనూ దీన్ని వాడడం అనివార్యంగా మారింది. దీంతో డెస్క్‌టాప్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ తన డెస్క్‌టాప్‌ యాప్‌ను (Whatsapp desktop) మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా కొత్త విండోస్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చింది.

వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త యాప్‌ను మైక్రోసాఫ్ట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్త డెస్క్‌టాప్‌ యాప్‌ వేగంగా లోడ్‌ అవ్వడమే కాకుండా ఇంటర్‌ఫేస్‌లో సైతం మార్పులు చేసింది. ఇకపై వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ ద్వారా ఏకకాలంలో 8 మందితో వీడియో కాల్‌లో సంభాషించొచ్చు. 32 మందితో గ్రూప్‌ ఆడియో కాల్స్‌ మాట్లాడొచ్చు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను మరింత పెంచుతామని వాట్సాప్‌ హామీ ఇచ్చింది.

మరోవైపు వాట్సాప్‌లో లింక్‌ డివైజ్‌ను ఫీచర్‌ను సైతం మెటా మరింత మెరుగుపరిచింది. ఒకప్పుడు వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌లో వాడాలంటే మొబైల్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి వచ్చింది. ఇంటర్నెట్‌ తప్పనిసరిగా ఆన్‌లో ఉంచాల్సి ఉండేది. లింక్‌ డివైజ్‌ ఫీచర్‌ తీసుకొచ్చాక మొబైల్‌ డేటా ఆఫ్‌లో ఉన్నా.. వాట్సాప్‌ను వినియోగించుకునే సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇలా నాలుగు డివైజ్‌లకు కనెక్ట్‌ కావొచ్చు. డివైజ్‌ను వేగంగా లింక్‌ చేసుకోవడంతో పాటు వేగంగా సింక్‌ చేసుకోవచ్చని మెటా పేర్కొంది. కొత్తగా లింక్‌ ప్రివ్యూ, స్టిక్కర్లను సైతం తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని