Whatsapp ads: వాట్సప్‌లో యాడ్స్‌.. స్టేటస్‌, ఛానెళ్లలో కనిపించే ఛాన్స్‌!

Ads in Whatsapp: వాట్సప్‌లో త్వరలో యాడ్స్‌ దర్శనమివ్వనున్నాయి. స్టేటస్‌, ఛానెల్‌ విభాగాల్లో ఇవి దర్శనం ఇవ్వనున్నాయి. ఎప్పుడనేది కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

Published : 09 Nov 2023 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌లో ప్రకటనల (Ads) గురించి చర్చ ఈనాటిది కాదు. ఏళ్లుగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. దాదాపు అన్ని యాప్స్‌ ప్రకటనల ఆదాయంపై ఆధారపడుతుంటే.. దాదాపు 200 కోట్లకు యూజర్లు కలిగిన వాట్సప్‌ (Whatsapp) మాత్రం ఇప్పటికీ యాడ్స్‌ చూపించడం లేదు. అయితే, ఇదిగో వస్తున్నాయ్‌.. అదిగో వస్తున్నాయ్‌ అంటూ ఎప్పటికప్పుడు వార్తలు రావడం.. దాన్ని వాట్సప్‌ ఖండించడం మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతోంది. తాజాగా వాట్సప్‌ హెడ్‌ విల్‌ క్యాత్‌కార్ట్‌ స్వయంగా దీనిపై మాట్లాడారు.

బ్రెజిల్‌ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సప్‌లో ప్రకటనల గురించి ప్రస్తావించారు. మెయిన్‌ ఇన్‌బాక్సులో ఎలాంటి ప్రకటనలూ చూపించాలని వాట్సప్‌ అనుకోవడం లేదని చెప్పారు. అది ఎంతమాత్రం సరైన పద్ధతి కాదన్నారు. అయితే, ఛానెళ్లు, స్టేటస్‌ వంటి చోట్ల యాడ్స్‌ చూపించే అవకాశం ఉందని చెప్పారు. ఛానెళ్లకు భవిష్యత్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సి రావొచ్చని, పెయిడ్‌ మెంబర్లకు మాత్రమే కంటెంట్‌ ఇవ్వొచ్చని లేదా తమ ఛానెల్‌ను ప్రమోట్‌ చేయాలని సదరు ఛానెల్‌ యజమానే కోరొచ్చని చెప్పారు. అయితే, యాడ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఎప్పుడు తీసుకొచ్చేదీ చెప్పలేదు.

Jio Swiggy plan: స్విగ్గీ వన్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాట్సప్‌లో ప్రకటనలు రావొచ్చంటూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ అనే పత్రిక ఓ కథనం ప్రచురించగా.. అప్పట్లో ఇదే క్యాత్‌కార్ట్‌ ఖండించారు. ఇప్పుడు కొన్ని నెలలు గడవక ముందే ప్రకటనలు తీసుకురానున్నట్లు ఆయనే మాట్లాడడడం గమనార్హం. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా వాట్సప్‌ ప్రకటనలైతే చూపించడం లేదు. మెటాకు చెందిన ఇతర యాప్స్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ఇప్పటికే యాడ్స్‌ చూపిస్తుండగా.. ఆదాయం కోసం ఏదో రోజు వాట్సప్‌ సైతం యాడ్స్‌ తీసుకురావొచ్చని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని