WhatsApp: వాట్సాప్‌లో ఫోన్ నంబర్‌ లేకుండానే లాగిన్‌!

వాట్సాప్‌లో ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండా ఖాతాలోకి లాగిన్‌ అయ్యేందుకు కొత్త ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Published : 07 Nov 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండా ఈ-మెయిల్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఖాతాల్లోకి లాగిన్‌ చేయొచ్చు. ఇప్పటివరకు కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ లాగిన్‌ చేయాలంటే ఫోన్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి. ఇందుకోసం 6 అంకెల ఓటీపీ మెసేజ్‌ ఫోన్‌కు వస్తుంది. ఒకవేళ ఫోన్‌ నంబర్‌ పనిచేయకున్నా.. నెట్‌వర్క్‌ సరిగా లేకున్నా.. ఓటీపీ రాదు. దీనికి ప్రత్యామ్నాయంగానే.. వాట్సాప్ లాగిన్‌ కోసం ఈ-మెయిల్ వెరిఫికేషన్‌ను ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌.. ఐఓఎస్‌, ఆండ్రాయి బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

రిమోట్‌ వర్క్‌తో కెరీర్‌కు నష్టమే..!

వాట్సాప్‌ ఈ-మెయిల్ వెరిఫికేషన్‌ కోసం యూజర్లు ఫోన్‌ నంబర్‌కు బదులుగా తమ మెయిల్‌ ఐడీ టైప్‌ చేయాలి. తర్వాత వెరిఫికేషన్‌ మెయిల్‌ ఓపెన్‌ చేసి ఈ-మెయిల్‌ ఐడీని వెరిఫై చేస్తే.. వాట్సాప్‌ ఖాతా లాగిన్‌ అవుతుంది. వాట్సాప్‌ వెరిఫికేషన్‌ కోసం యూజర్లు టైప్‌ చేసే ఈ-మెయిల్‌ ఐడీ వివరాలు ఇతరులకు కనిపించవు. గతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను రింగ్‌ అవ్వకుండా సైలెన్స్‌ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆడియో, వీడియో కాల్స్‌ సమయంలో లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ వివరాలు అవతలి వాళ్లకు తెలియకుండా ప్రొటెక్ట్ చేసే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది. ఇవేకాకుండా యూజర్‌ భద్రత కోసం మరికొన్ని ఫీచర్లను వాట్సాప్‌ పరీక్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని