Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?

మార్కెట్లలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి.

Published : 18 Mar 2024 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత నెల రోజుల నుంచి స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు చాలా వేగంగా క్షీణించాయి. ఇందులో మదుపు చేసిన మిడ్/స్మాల్ కాప్ మ్యూచువల్ ఫండ్లు కూడా నష్టాలకు గురయ్యాయి. అనేక పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించడం వల్ల వీటిలో లిక్విడిటీ సమస్య తలెత్తింది. మార్కెట్‌ క్రాష్‌, ఉపసంహరణ సమయంలో మదుపుదారుల పెట్టుబడిని రక్షించడానికి ఒక విధానాన్ని రూపొందించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ (సెబీ).. మ్యూచువల్‌ ఫండ్ల సంస్థలను కోరింది. పెద్ద కంపెనీల కంటే చిన్న కంపెనీ స్టాక్స్‌ను త్వరగా విక్రయించడం కష్టం. దీనికి సమయం కూడా పడుతుంది. కాబట్టి ఫండ్‌ మేనేజర్లు ప్రతి ఒక్కరి రిడెంప్షన్ అభ్యర్థనలను తీర్చడానికి తగినంత స్టాక్స్‌ను వేగంగా విక్రయించగలరా అని కూడా సెబీ తనిఖీ చేస్తోంది. దీని ఫలితంగా ప్రతి ఫండ్‌ తమ హోల్డింగ్స్‌లో 25-50% విక్రయించడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడు వెల్లడిస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్ సంస్థలు ఆయా పోర్ట్‌ఫోలియోలను లిక్విడేట్‌ చేయడానికి కొంత సమయం తీసుకుంటున్నాయి. ఎంత శాతం లిక్విడిటీకి ఎంత సమయాన్ని మ్యూచువల్‌ ఫండ్ల సంస్థలు తీసుకుంటున్నాయో కింది పట్టికలో చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని