YouTube: యాడ్ బ్లాకర్స్‌ వినియోగిస్తున్నారా? యూట్యూబ్‌ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది!

YouTube: యాడ్‌ బ్లాకర్లను అరికట్టడానికి యూట్యూబ్ తన ప్రయత్నాలను విస్తృతం చేస్తోంది. అందులో భాగంగానే యూట్యూబ్‌ యాడ్‌ బ్లాకర్లను వినియోగించే వారిని బ్లాక్‌ చేయాలని నిర్ణయించింది.

Published : 02 Nov 2023 02:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూట్యూబ్‌ (Youtube)లో యాడ్స్‌ లేకుండా వీడియోలు చూడటానికి యాడ్‌ బ్లాకర్లను (Ad Blockers) వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్‌న్యూస్‌. ఇకపై  యూట్యూబ్‌లో యాడ్‌ బ్లాకర్స్‌ని వినియోగించటానికి వీలుండదు. ఒకవేళ వినియోగిస్తే యూట్యూబ్‌ మిమ్మల్ని బ్లాక్‌ చేస్తుంది. ప్రకటనలు లేకుండా యూట్యూబ్‌ వీడియోలు చూడాలంటే కచ్చితంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగా యూట్యూబ్‌ యాడ్‌లను పెంచటంతో చాలామంది యాడ్ బ్లాకర్లను వాడటం మొదలుపెట్టారు. దీంతో యాడ్‌ బ్లాకర్లను డిసేబుల్‌ చేయకపోతే మూడు వీడియోలు మాత్రమే ప్లే అవుతాయి. ఆ తర్వాత వీడియోల్ని నిలిపివేయనున్నట్లు యూట్యూబ్ జూన్‌లోనే ప్రకటించింది. తాజాగా యాడ్‌ బ్లాకర్లపై దృష్టి సారించింది.  ప్రపంచవ్యాప్తంగా యాడ్‌ బ్లాకర్లు వాడే వారికి సందేశాలు పంపించి బ్లాక్‌ చేస్తోంది. ‘యాడ్‌ బ్లాకర్లను వినియోగిస్తే యూట్యూబ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లే. యాడ్‌ బ్లాకర్లను వాడొద్దని ఇప్పటికే సూచించాం. ఒక వేళ ప్రకటనలు రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది’ అని యూట్యూబ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ క్రిస్టోఫర్ లాటన్ ఓ ప్రకటనలో తెలిపారు.

నరేశ్‌ గోయల్‌కు చెందిన రూ.538 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్‌

ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్‌ 30 సెకండ్ల పాటు అన్‌స్కిప్పబల్‌ యాడ్స్‌ని టీవీ యాప్‌లో ఈ ఏడాది మేలోనే తీసుకొచ్చింది. ఇప్పుడు వీటి నిడివిని పెంచాలని చూస్తోంది. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగానే యూట్యూబ్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా నాలుగు రకాల ప్లాన్లను యూట్యూబ్‌ అందిస్తోంది. నెలవారీ ప్లాన్‌ రూ.139 (వితౌట్‌ ఆటో రెన్యువల్‌), రూ.129 (విత్‌ ఆటో రెన్యువల్‌), రూ.399తో మూడునెలల ప్లాన్, రూ.1,290కి ఏడాది ప్లాన్‌లను యూట్యూబ్‌ అందిస్తోంది. ఒకవేళ ఫ్యామిలీ ప్లాన్‌ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ప్రీమియం ప్రయోజనాలు పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని