close
గుస‌గుస‌లు
‘డియర్‌ కామ్రేడ్‌’కు నోచెప్పిన సాయిపల్లవి?

అందుకేనట?

హైదరాబాద్‌: ‘డియర్‌ కామ్రేడ్’లో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు తొలుత సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రమిది. భరత్‌ కమ్మ దర్శకుడు. రష్మిక కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. పలు లిప్‌లాక్‌ సన్నివేశాలు కూడా కనిపించాయి. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా ఈ సినిమా కోసం సాయిపల్లవిని తీసుకోవాలని తొలుత అనుకున్నారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లిప్‌లాక్‌ సీన్లు ఉండటంతో ఆమె నటించేందుకు ఒప్పుకోలేదట. అలాంటి సన్నివేశాల్లో నటించడం సౌకర్యంగా ఉండదని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రష్మికను తీసుకున్నారట. అయితే ఈ ప్రచారంపై సాయిపల్లవి, ‘డియర్‌ కామ్రేడ్‌’ యూనిట్‌ స్పందించాల్సి ఉంది. సాయిపల్లవి ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించారు. ఎక్కువగా మేకప్‌ వేసుకోవడం, పొట్టి దుస్తులు ధరించడం, రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడానికి ఈ భామ అంగీకరించరు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.