Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141863
            [news_title_telugu_html] => 

బంగారు ఉంగరాలు బహూకరించిన హీరో

[news_title_telugu] => బంగారు ఉంగరాలు బహూకరించిన హీరో [news_title_english] => Vijay’s gifted goldrings for 400 crew members [news_short_description] => తమిళ హీరో, ఇళయపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బిగిల్‌’. మురగదాస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం విజయ్‌... [news_tags_keywords] => Bigil,Vijay,Nayanatara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0210, ) )
బంగారు ఉంగరాలు బహూకరించిన హీరో - Vijay’s gifted goldrings for 400 crew members - EENADU
close
అవీ.. ఇవీ..
బంగారు ఉంగరాలు బహూకరించిన హీరో

సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: తమిళ హీరో, ఇళయపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బిగిల్‌’. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం విజయ్‌ అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చివరిదశ చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌ ఇటీవల తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ ఈ సినిమా కోసం కష్టపడిన 400 మంది నటులు, టెక్నీషియన్స్‌కు బంగారు ఉంగరాలను అందించారు. అంతేకాకుండా తన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫుట్‌బాల్స్‌ను సైతం బహూకరించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రి, కుమారుడి పాత్రల్లో కనిపించనున్నారు. 

ఒక గ్యాంగ్‌స్టార్‌, మహిళ ఫుట్‌బాల్‌ కోచ్‌గా విజయ్‌ కనిపించనున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత సమకూర్చుతున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.