close
కొత్త సినిమాలు
‘బేబీ’ సమంత వచ్చేస్తోంది!

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ‘ఓ బేబీ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను జులై 5న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కుటుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గ‌డ‌పాల‌నే విష‌యాల‌ను ఆలోచింప చేసే కోణంలో దర్శకురాలు నందిని రెడ్డి సినిమాను రూపొందించారట. ఇందులో వినోదానికి పెద్ద పీట వేసినట్లు యూనిట్ పేర్కొంది.

ఈ సినిమాలో సమంతతోపాటు నాగశౌర్య, రావు రమేశ్‌, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్షన్స్‌‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కోసం మహిళా ఆర్టిస్టులు, మహిళా సాంకేతిక నిపుణులు ఎక్కువ మంది ప‌నిచేయ‌డం విశేషం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.