close
కొత్త సినిమాలు
ఇక అక్కడ కూడా సందడి చేయనున్న రష్మి

చెన్నై: నరేష్, ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ రష్మి గౌతమ్‌ తదితరులు నటించిన చిత్రం ‘గుంటూరు టాకీస్‌’. యువతను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు తమిళ తంబిలను మురిపించడానికి వస్తోంది. శ్రీచరణ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి రామ్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 2016 మార్చిలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలో అనువాదమవుతోంది. ఈ అడల్ట్‌ కామెడీ చిత్రంలో రష్మి అందాలు ఆరబోసింది. వాస్తవానికి ఈ సినిమా తమిళంలో ‘ఇవనుక్కు ఎంగయో మచ్చం ఇరుక్కు’ పేరిట రీమేక్‌ అయింది. అందులో విమల్, అష్ణాజవేరి నటించారు. కానీ ఇప్పుడు అనువాదంగా ‘నెం.9, భజనై కోవిల్‌ తెరు’ పేరిట ప్రేక్షకులను పలకరించనుంది. బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై విద్యాసాగర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.