
ఇంటర్నెట్‌డెస్క్: 1974లో ఒక పత్రికలో ఒక పాఠకుడు ప్రముఖ నటి భానుమతిని ‘ఊర్వశి’ బిరుదు మీకు ఎందుకు రాలేదు? అని అడిగాడు. (అప్పట్లో కేంద్ర జాతీయ బహుమతుల్లో ఉత్తమ నటికి ‘ఊర్వశి’ అని, ఉత్తమ నటుడికి ‘భరత్’ అని బిరుదులు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ బిరుదులను తొలగించారు) దానికి భానుమతి ఆ పత్రికలో ఇలా సమాధానం ఇచ్చారు.
‘‘ఊర్వశి’ అంటే తెలియని అమాయకత్వంలో నన్ను పడేసి, మరింత ఉత్తమ నటనకు ఆస్కారమైన ఊర్వశి రాలేదేంటని నన్ను అధః పాతాళానికి తోసేశారు. ఈనాడు ఏ మాత్రం విలువలేని ‘పద్మశ్రీ’ ఎందుకు పొందానా? అని బాధ పడుతున్నా. నన్ను ‘ఊర్వశి’ బిరుదు తెచ్చుకోమంటారేమిటండీ? ఈ ప్రభుత్వం వారిచ్చే ఊర్వశి, నాలాంటి నటీమణి ప్రతిభకి కొలమానమా? హతవిధీ! ఊర్వశికి అదే ప్రమాణమైతే నేను నా మొదటి చిత్రం ‘వర విక్రయం’లోనే ఊర్వశినయ్యాను. అద్భుతంగా నటించి, కన్నీరు కార్చాను. ప్రజలను కూడా కన్నీరు పెట్టించాను. ఇంకెన్నడూ ఊర్వశి కోసం ప్రయత్నించమని నన్ను అవమానపరచకండి. ఈ అవార్డు కోసం తాపత్రయపడే అలవాటు నాకు లేదు. ఒక వేళ ప్రభుత్వ వారు ఊర్వశి ఇచ్చినా తిరస్కరిస్తాను’’ అని అన్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్