Updated : 10 Aug 2021 20:05 IST

అవి చూస్తే ఆగలేను!

చూపుల్లో చురుకుతనం... మాటల్లో కొంటెతనం... నవ్వులో అమాయకత్వం... అన్నీ కలగలిపితే సమంత. పెళ్లి తరవాత కూడా కెరీర్‌కు బ్రేక్‌ ఇవ్వకుండా మునపటి కంటే ఉత్సాహంగా దూసుకుపోతోంది. ‘జానూ’లో భగ్నప్రేమికురాలిగా ప్రేక్షకుల గుండెల్ని బరువెక్కిస్తున్న ఈ అమ్మడి ఇష్టాయిష్టాలేంటంటే...


నచ్చే హాలిడే స్పాట్‌

మియామి... ఫ్లోరిడాలో ఉంటుందీ నగరం. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ నగరంలో బీచ్‌ ప్రధాన ఆకర్షణ.


వినోదం కోసం...

అమెరికన్‌ వెబ్‌సిరీస్‌ ఎక్కువగా చూస్తా. వాళ్లు తీసుకునే లైన్‌ చాలా బాగుంటుంది.


మగవాళ్లలో నచ్చేది

సెన్సాఫ్‌ హ్యూమర్‌. అవును, అది ఉంటేనే ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా కనిపిస్తారు.


ఇష్టంగా తినేవి

సూషీలు, డెయిరీ మిల్క్‌, పాలకోవా చాలా ఇష్టం. డైటింగ్‌ వల్ల సూషీలు మాత్రం తింటున్నా. చాక్లెట్‌, కోవాలు కంటికి కనిపిస్తే మాత్రం ఆగలేను.


ఓ జ్ఞాపకం

చైతూ మాల్దీవుల్లో ప్రపోజ్‌ చేసిన క్షణాలు. నేనెప్పుడన్నా లో అయ్యాననిపిస్తే ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటా.


నటి కాకపోయుంటే...

కంప్యూటర్‌ ముందు కూర్చుని కళ్లజోడు పెట్టుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తుండేదాన్ని. కచ్చితంగా డబ్బు మాత్రం సంపాదిస్తుండేదాన్ని. ఎందుకంటే చిన్నప్పట్నుంచీ అది నా కల.


నచ్చే ఆభరణాలు

డైమండ్‌ నగలంటే చాలా ఇష్టం. నాకు అవి బాగా నప్పుతాయి.


చైతూ ఇచ్చిన మొదటి బహుమతి

హ్యండ్‌ బ్యాగు, చేత్తో రాసిన కొన్ని కొటేషన్లు, తను వేసిన పెయింటింగ్‌...


స్ఫూర్తి

అండ్రూ హెప్‌బన్‌... ఆమె ఒకప్పటి బ్రిటిష్‌ హీరోయిన్‌, ఫ్యాషన్‌ ఐకాన్‌. గొప్ప మానవతావాది కూడా. నటిగా బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసేది.


ఇష్టమైన పుస్తకం

నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. స్టీఫెన్‌ హాకింగ్‌ రాసిన ‘ది గ్రాండ్‌ డిజైన్‌’, రోండా బైర్న్‌ రాసిన ‘ది సీక్రెట్‌’ పుస్తకాలకు వీరాభిమానిని. ఇప్పటికీ నా హ్యాండ్‌ బ్యాగులో ఏదో ఒక పుస్తకం ఉంటుంది.


తెరవెనక పేరు

యశోద... స్కూల్లో, కాలేజీలో, ఇంట్లో అదే పేరుతో పిలుస్తారు.


షూటింగ్‌ గ్యాప్‌లో...

ఫోన్‌ చూస్తుంటా. ఈ రోజుల్లో అదే కదా బెస్ట్‌ ఫ్రెండ్‌...


ఎక్కువగా వినే పాట

అఆలో ‘వెళ్లిపోకె శ్యామలా...’ పాట అంటే నాకు చాలా ఇష్టం. ప్రయాణాల్లో ఆ పాటను ఎక్కువగా వింటా.


 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని