ప్రతి పనినీ ‘స్మార్ట్‌’గా చక్కబెట్టేందుకు.. మీక్కావాలి అమెజాన్‌ అలెక్సా.. (ప్రకటన)

ఈ డిజిటల్‌ యుగంలో అంతా స్మార్ట్‌మయం. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్లే.. అనేకమంది ప్రతి పనినీ స్మార్ట్‌గానే చక్కబెడుతున్నారు. అసలు స్మార్ట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది .....

Updated : 08 Aug 2022 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ డిజిటల్‌ యుగంలో అంతా స్మార్ట్‌మయం. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్లే.. అనేకమంది ప్రతి పనినీ స్మార్ట్‌గానే చక్కబెడుతున్నారు. అసలు స్మార్ట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అమెజాన్‌కు చెందిన అలెక్సా. అమెజాన్‌.. వాయిస్‌ అసిస్టెంట్‌ అధునాతన ఫీచర్లతో ఇప్పుడు దేశంలోని అనేక కుటుంబాల్లో ఒక సభ్యుడిగా మారిపోయింది. మీరు సాధారణ వాయిస్ కమాండ్‌తోనే సమాచారం పొందొచ్చు. సంగీతం వినడం, స్మార్ట్‌ గృహోపకారణాల నియంత్రణ, అలారాలు సెట్‌ చేయడం, పిల్లల కథనాలు వినడం.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో పనులు చేయవచ్చు. దేశంలో ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఎకో స్మార్ట్‌ స్పీకర్లు కొనుగోలు చేశారు. వాటి ద్వారా ప్రతి వారం అలెక్సాతో మిలియన్ల కొద్దీ పనులు పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు, అలెక్సా అందరినీ ఆకట్టుకొనే వాయిస్‌ ఇంటర్‌ఫేస్‌, అద్భుతమైన టెక్నాలజీతో మరింత ఆకర్షణీయంగా మార్చింది.

కేవలం ఒక్క కమాండ్‌తో మీకు ఇష్టమైన సంగీతం వినొచ్చు!

అమెజాన్‌ మ్యూజిక్‌, స్పాటిఫై, హంగామా మ్యూజిక్‌, జియో సావన్‌, యాపిల్‌ మ్యూజిక్‌లాంటి యాప్‌ల నుంచి అలెక్సాకు కమాండ్‌ ఇవ్వడం ద్వారా మీకు ఇష్టమైన సంగీతం వినొచ్చు. అంతేకాకుండా ఎకో షో 5, 8, 10 వంటి సిరీస్‌లలో ఆన్-స్క్రీన్ లిరిక్స్‌తో పాటు మీరు కూడా సొంతంగా పాటలు పాడుకోవచ్చు. దీంతోపాటు మీకు ఇష్టమైన ప్లేలిస్ట్‌కు మరిన్ని ఇష్టమైన పాటల్ని జోడించాలని అలెక్సాకు ఆర్డర్‌ వేయవచ్చు. అలెక్సాను ‘‘అలెక్సా.. శ్రీవల్లి ప్లే చేయ్ లేదా అలెక్సా.. హైదరాబాద్‌ నుంచి పాపులర్‌ అయిన పాటలు ప్లే చేయ్‌’’ అని అడగవచ్చు.

అలెక్సాని అడిగి టీవీ షోలను కూడా చూడొచ్చు. అలాగే మరికొన్ని షోలను కూడా సెర్చ్‌ చేయవచ్చు. ఎకో షో, ఫైర్‌ టీవీ స్టిక్‌ పరికరాలతో మీ వాయిస్‌ను ఉపయోగించి ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ నుంచి మీకు ఇష్టమైన చిత్రాలు, షోలను సులభంగా తెలుసుకోవచ్చు. ‘‘అలెక్సా.. నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలిని ప్లే చేయ్‌” లేదా “అలెక్సా.. ప్రైమ్ వీడియోలో పుష్ప ప్లే చేయ్‌” అని చాలా సింపుల్‌గా అడగవచ్చు. ఫైర్ టీవీ స్టిక్‌తో మీ సాధారణ టీవీ కూడా ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోతుంది. అసలు ఎలాంటి, ఎంత కంటెంట్‌ ఉందో సులభంగా తెలుసుకోవడానికి, అలాగే ప్లే చేసుకొని వీక్షించేందుకు, కంట్రోల్‌ చేయడానికి కేవలం ఒక్క వాయిస్‌ కమాండ్‌తో అలెక్సా ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు ఆన్-డిమాండ్, లైవ్‌ టీవీల మధ్య ఇన్‌పుట్‌లను మార్చేందుకు, వాయిస్‌ కమాండ్‌ను ఉపయోగించడం ద్వారా అలెక్సా స్కిల్స్‌ను యాక్సిస్‌ చేయడానికి, అలెక్సా వాయిస్‌ రిమోట్‌ను ఉపయోగించుకోవచ్చు. 

క్విజ్‌, సరదా ఆటలతో మీ ప్రియమైనవారితో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటే ఇష్టం. కాని ఎవరికివారే ఆడుకొంటున్నారు. అదే గేమ్స్‌ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకుంటే.. అందుకు అలెక్సా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలెక్సాలోని కొన్ని టాప్‌గేమ్‌లు ఆడుకోవచ్చు. అలాగే, పిల్లలకు మరింత విజ్ఞానాన్ని అందించే ఇంపాజిబుల్‌ బాలీవుడ్‌ క్విజ్‌, అకినేటర్‌, 20 ప్రశ్నలు లాంటివి కూడా ఇందులో ఉంటాయి. వాటిని యాక్సిస్‌ చేసేందుకు ‘‘అలెక్సా.. ఓపెన్‌ ఇంపాజిబుల్‌ బాలీవుడ్‌ క్విజ్‌’’ అని కమాండ్‌ ఇవ్వడమే. అంతే.. మీ ప్రియమైన వారితో సరదాగా క్విజ్‌ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆనందంగా గడపవచ్చు. 

మీ పిల్లల కోసం అద్భుతమైన వినోదం, విజ్ఞానం కూడా..

మీ చిన్నారులకు అలెక్సా అద్భుతంగా ఉపయోగపడడమే కాకుండా ఒక ఫ్రెండ్‌లా పనిచేస్తుంది. జంతువుల శబ్దాలు, కిడ్డో, ఏబీసీ వంటి గేమ్‌లు వినోదాత్మకంగా మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని పంచేలా ఉంటాయి. చిన్న పిల్లలు ‘నాని తేరి మోర్ని’ వంటి రైమ్స్‌ని ఇష్టపడతారు. ఒకవేళ ఏడుస్తున్నప్పుడు అలెక్సా వారికి అద్భుతమైన కథలను చెబుతుంది. ఈ ఫీచర్‌లను ఆస్వాదించడానికి మీ పిల్లల కోసం “అలెక్సా.. రాత్రి పూట నిద్రపుచ్చే కథలు చెప్పు”, “అలెక్సా.. నాని తేరి మోర్ని ప్లే చేయ్‌” అని అడగవచ్చు.

అలెక్సాతో జోకులు, షాయారీలతో నవ్వండి.. ఆనందంలో మునిగిపోండి..

మీరు మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు, అలెక్సా మిమ్మల్ని మరింత నవ్వించేందుకు జోక్ లేదా సరదా సంఘటనలను చెప్పేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. “అలెక్సా.. నన్ను నవ్వించండి” లేదా “అలెక్సా.. నాకు ఇంజనీర్/రజనీకాంత్ జోక్ చెప్పండి” అని అడగవచ్చు. అంతేకాకుండా మీరు కొంత కవిత్వాన్ని ఆస్వాదించే మూడ్‌లో ఉంటే.. "అలెక్సా.. రేఖ్తా తెరవండి" అని చెప్పి మీకు ఇష్టమైన వాటిని ప్లే చేయమని అలెక్సాని అడగవచ్చు.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని