iPhone 15 Delivery: ఐఫోన్‌ 15లో ఆ వేరియంట్ల కోసం 2 నెలలు ఆగాల్సిందే!

iPhone 15 Delivery: ఐఫోన్‌ 15 సిరీస్‌ మోడళ్లు సెప్టెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో వీటి ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

Updated : 18 Sep 2023 15:06 IST

దిల్లీ: ఇటీవల విడుదలైన ఐఫోన్‌ 15 (iPhone 15) ప్రీఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 22 నుంచి ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే, కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సిరీస్‌లో టాప్‌ మోడల్‌ అయిన ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max)లో బ్లూ టైటానియం, బ్లాక్‌ టైటానియం కలర్‌ వేరియంట్లు అక్టోబర్‌ మూడోవారంలో కొనుగోలుదారుల చేతికి రానున్నాయి. నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం వేరియంట్ల కోసమైతే నవంబర్‌ రెండోవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి.

ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ది సైతం ఇదే పరిస్థితి. వేరియంట్లతో సంబంధం లేకుండా ఈ మోడల్‌ మొత్తం అక్టోబర్‌ మూడో వారం నుంచి అందుబాటులోకి రానుంది. అయితే, ఈ మోడల్‌లో 1టీబీ స్టోరేజ్‌ వైట్‌ టైటానియం కలర్‌ వేరియంట్‌కు మాత్రం మినహాయింపు ఉంది. ఈ ఫోన్‌ సెప్టెంబర్‌ 22 నుంచే వినియోగదారులకు లభించనుంది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ బేస్‌ మోడళ్ల డెలివరీ సైతం కొంచెం ఆలస్యం కానుంది. సెప్టెంబరు ఆఖర్లో లేదా అక్టోబర్‌ మొదటివారంలో ఇది కొనుగోలుదారులకు లభించనున్నట్లు యాపిల్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది.

టైప్‌-సి పోర్ట్‌..యాక్షన్‌ బటన్‌..ఐఫోన్‌ 15 సిరీస్‌లో కొత్త మార్పులివే!

ఐఫోన్‌ 15 సిరీస్‌ మోడళ్లు సెప్టెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో వీటి ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. బేస్‌ మోడళ్లు పింక్‌, యెల్లో, గ్రీన్‌, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్‌ వేరియంట్లను అందిస్తున్నారు. ప్రో మోడల్స్‌లో 1టీబీ స్టోరేజ్‌ వరకు అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని