iOS 17: ఐఓఎస్ @ 17
iOS 17: యాపిల్ సంస్థ ఇటీవల వండర్‌లస్ట్ కార్యక్రమంలో ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు పరిచయం చేసింది. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2 కూడా ప్రవేశపెట్టింది
యాపిల్ సంస్థ ఇటీవల వండర్‌లస్ట్ కార్యక్రమంలో ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు పరిచయం చేసింది. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2 కూడా ప్రవేశపెట్టింది. అంతేనా? ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఓఎస్ 17 (iOS 17) విడుదలనూ ప్రకటించింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించిన దీన్ని తాజాగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి కొత్త మొబైల్ సాఫ్ట్‌వేర్‌లో మాదిరిగానే ఐఓఎస్ 17 (iOS 17)లోనూ కొన్ని రహస్య ఫీచర్లు, సెటింగ్స్ ఉన్నాయి. అందరికీ తెలిసిన, ప్రాచుర్యం పొందిన ఫీచర్ల మాదిరిగానే ఇవీ రోజువారీ వ్యవహారాలకు బాగా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఫేస్‌టైమ్ వీడియో మెసేజెస్
స్నేహితుడికో, మరెవరికో ఫోన్ చేస్తాం. వాళ్లు మాట్లాడలేదు. వెంటనే మరోసారి కాల్ చేయాల్సిన అవసరం లేకుండా వీడియో సందేశాన్ని పంపించటానికి ఫేస్‌టైమ్ వీడియో మెసేజెస్ ఫీచర్ వచ్చింది. నంబరుకు కాల్ చేసిన కొంతసేపటికి రికార్డ్ వీడియో బటన్ కనిపిస్తుంది. దీని మీద నొక్కి పడితే కౌంట్‌డౌన్ మొదలవుతుంది. అనంతరం వీడియో రికార్డు అవుతుంది. కావాలనుకుంటే దీన్ని రీరికార్డు చేసుకోవచ్చు. తర్వాత ఆకుపచ్చ బటన్ నొక్కి, సందేశాన్ని పంపొచ్చు. అవతలివారికిది ఫేస్‌టైమ్ యాప్‌లో కనిపిస్తుంది.
ఇష్టమైన స్టికర్స్
స్టికర్ ప్రియులకు నచ్చే ఫీచర్ ఇది. దీని ద్వారా ఫొటోలో నచ్చిన వాటిని స్టికర్‌గా మార్చుకోవచ్చు. ముందు ఫొటోలోని వస్తువు మీద నొక్కాలి. అప్పుడు అవుట్ లైన్ ఏర్పడుతుంది. తర్వాత యాడ్ స్టికర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో అది దానంతటదే స్టికర్ డ్రాయర్‌లో సేవ్ అవుతుంది. దీనికి ఎఫెక్ట్‌లు, వేర్వేరు స్టైళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు- లైవ్ ఫొటో ఆప్షన్ ఎంచుకుంటే యానిమేషన్ మాదిరిగా స్టికర్ కదులుతుంది.
కోడ్స్ శుభ్రం
ఆన్‌లైన్ భద్రత కోసం ఇప్పుడు టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడకం పెరిగింది. ముందుగా పరికరానికి అందే కోడ్‌తో ధ్రువీకరించుకోవటం దీని ప్రత్యేకత. టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో యాప్‌లో లాగిన్ అయిన ప్రతిసారీ టెక్స్ట్ మెసేజ్ లేదా ఈమెయిళ్ల ద్వారా ఈ కోడ్స్ అందుతాయి. ఇవన్నీ మెసేజెస్‌లో, ఈమెయిల్‌లో నిండిపోతూ వస్తాయి. వీటిని ఒక్కొక్కటిగా డిలీట్ చేసుకోవాల్సిందే. ఐఓఎస్ 17 (iOS 17) దీనికి మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చింది. వాటంతటవే డిలీట్ అయ్యే మార్గాన్ని చూపిస్తోంది. సెటింగ్స్ ద్వారా పాస్‌వర్డ్‌లోకి వెళ్తే పాస్‌వర్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో క్లీన్ అప్ ఆటోమేటికల్లీ బటన్‌ను ఆన్ చేసుకుంటే చాలు. మెసేజెస్, మెయిల్‌కు వచ్చిన వెరిఫికేషన్ కోడ్స్ వాడుకున్న తర్వాత వాటంతటవే తొలగిపోతాయి.
ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త మార్పులివే!
ఇంటరాక్టివ్ విడ్జెట్స్
హోం స్క్రీన్ మీద విడ్జెట్లు కేవలం అందానికే కాదు. ఐఫోన్ ఇంటరాక్టివ్ విడ్జెట్స్‌నూ ప్రవేశపెట్టింది. కంట్రోల్ సెంటర్ మాదిరిగానే హోం స్క్రీన్ నుంచీ అప్లికేషన్లను కంట్రోల్ చేయటానికివి వీలు కల్పిస్తాయి. ఇప్పటివరకు ఇంటరాక్టివ్ విడ్జెట్లు పరిమితంగానే ఉండేవి. ఇప్పుడు మరిన్ని జత చేసుకోవచ్చు. హోం స్క్రీన్‌లో ఖాళీగా ఉన్నచోట వేలితో నొక్కిపడితే ఎడిట్ మోడ్ కనిపిస్తుంది. ఇందులో ప్లస్ గుర్తు మీద తాకితే పాడ్‌కాస్ట్, హోం, నోట్స్, మ్యూజిక్ వంటి విడ్జెట్ల జాబితా కనిపిస్తుంది. వీటిల్లో ఇష్టమైనది ఎంచుకోవచ్చు. ఉదాహరణకు- మ్యూజిక్ విడ్జెట్ ఎంచుకుంటే ప్లే, పాజ్ చేసుకోవచ్చు. హోం విడ్జెట్‌తో స్మార్ట్ బల్బుల వంటివి ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లోనూ మ్యాప్స్
ఐఫోన్‌లో యాపిల్ మ్యాప్స్ వాడుకోవాలంటే ఇంటర్నెట్‌కు అనుసంధానం కావాల్సిందే. ఇంటర్నెట్ కనెక్షన్ లేని చోట్ల ఇది ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఇకపై అలాంటి బాధేమీ ఉండదు. మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఆఫ్‌లైన్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. మ్యాప్స్‌లో పైన కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఫొటో మీద తాకితే మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కనిపిస్తుంది. ఒకవేళ ఫోన్‌లో తగినంత స్పేస్ లేకపోతే చిన్న సైజులోనూ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ మార్గాన్ని తెలుసుకోవచ్చు.
సులువుగా ఫొటో క్రాపింగ్
స్క్రీన్‌షాట్ లేదా ఫొటోలను క్రాప్ చేయటం ఐఫోన్‌లో తేలిక. దీన్ని ఐఓఎస్ 17 (iOS 17) మరింత సులువుగా మార్చింది. ఫొటోను చూస్తున్నప్పుడు జూమ్ చేసే సమయంలోనే కొద్ది సెకండ్ల పాటు క్రాప్ బటన్ కూడా కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా ఎడిట్ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. డన్ బటన్‌ను నొక్కితే అవసరమైనంత మేరకు ఫొటో క్రాప్ అవుతుంది.
లైవ్ వాయిస్ మెయిల్
ఎవరైనా వాయిస్ మెయిల్ పంపించారనుకోండి. ప్లే అవుతున్నప్పుడే అది అప్పటికప్పుడు టెక్స్ట్ రూపంలో ప్రత్యక్షమైతే? లైవ్ వాయిస్ మెయిల్ అలాంటి ఫీచరే. ఈ వాయిస్ మెయిల్ టెక్స్ట్‌ను చదువుతూనే మధ్యలో కాల్ చేయొచ్చు కూడా. ఏదైనా అత్యవసర విషయమైతే వెంటనే స్పందించటానికిది తోడ్పడుతుంది. ఐఓఎస్ 17 (iOS 17)లో లైవ్ వాయిస్ మెయిల్ సదుపాయం డిఫాల్ట్‌గా ఉంటుంది. వద్దనుకుంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు.
క్రాస్‌ఫేడ్ సాఫీగా
వేడుకల్లో, కారులో పాటలు వినటం మామూలే. యాపిల్ మ్యూజిక్ యాప్‌లో పాటలను ప్లే చేస్తుంటే ఆ మజానే వేరు. ఒక పాట పూర్తికాకముందే మరో పాట నెమ్మదిగా ఆరంభమైతే అంతరాయమనేదే ఉండదు. తాజా ఐఓఎస్‌లో క్రాస్‌ఫేడ్ ఫీచర్ ఇలాంటి అనుభూతినే కలిగిస్తుంది. సెటింగ్స్ ద్వారా మ్యూజిక్‌లోకి వెళ్లి క్రాస్‌ఫేడ్ బటన్‌ను ఆన్ చేసుకుంటే చాలు. ఎంతసేపు క్రాస్‌ఫేడ్ కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఒక సెకండు నుంచి 12 సెకండ్ల వరకు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు 10 సెకండ్లు ఎంచుకున్నామనుకోండి. వింటున్న పాట 10 సెకండ్లలో ముగుస్తుందగా తర్వాత పాట నెమ్మదిగా ప్లే అవటం మొదలెడుతుంది. తర్వాత ఫుల్ వ్యాల్యూమ్‌లో పాట వినిపిస్తుంది.
ఐఫోన్ 15లో భారత్ ముద్ర.. ఆ మోడల్స్‌లో నావిక్
లాండ్రీ కోడ్స్ మతలబు
దుస్తులను ఉతికే విధానాన్ని తెలియజేయటానికి వాటి మీద కోడ్స్ ఉండటం గమనించే ఉంటారు. అందరికీ వీటి అర్థాలు తెలియకపోవచ్చు. వీటిని చిటికెలో విడమరచటానికి ఐఓఎస్ 17 (iOS 17)కు కొత్త ఫీచర్ తోడైంది. ముందు కోడ్స్ పట్టీని ఫొటో తీయాలి. దీన్ని ఫొటోస్ టూల్‌లో బిల్టిన్‌గా ఉండే విజువల్ టుక్ అప్ ఫీచర్‌కు అప్పజెబితే చాలు. వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. అన్నట్టు మొక్కలు, నిర్మాణాల వంటి వాటి సమాచారాన్ని తెలియ జేసేదీ ఈ విజువల్ లుక్ అప్ ఫీచరే. ఇది దుస్తులను ఉతికే తీరునే కాదు, కారు డ్యాష్‌బోర్డులో ఏవైనా హెచ్చరిక లైట్లు వెలిగినా వాటి అర్థాన్నీ విడమరచగలవు. లైట్ల ఫొటో తీసి, పరిశీలిస్తే చాలు.
పాస్‌కోడ్ మరిచినా
ఐఫోన్ పాస్‌కోడ్‌ను మార్చారా? దాన్ని మరచిపోయారా? ఇప్పుడికి భయపడాల్సిన పనిలేదు. ఫర్‌గాట్ పాస్‌కోడ్ ఫీచర్ సాయం తీసుకోవచ్చు. కాకపోతే కొత్త అన్‌లాక్ కోడ్‌ను సెట్ చేసుకున్నాక మూడు రోజుల వరకే ఇది పనిచేస్తుంది. దీంతో పాత పాస్‌కోడ్‌తోనే కొత్త పాస్‌కోడ్‌ను సృష్టించుకొని, ఐఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. నాలుగో రోజున తిరిగి పరిస్థితి మొదటికే వస్తుందనుకోండి. అందువల్ల ఇది తాత్కాలికంగానే పని చేస్తుందని చెప్పుకోవచ్చు.
- కుటుంబ సభ్యులకు పాస్‌వర్డ్‌లను సురక్షితంగా షేర్ చేయటానికి ఐక్లౌడ్ కీచెయిన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాస్‌కీ ద్వారా ఆత్మీయులకు పాస్‌వర్డ్‌లను పంపించొచ్చు. ఎవరైనా చూస్తారేమోననే భయం ఉండదు.
స్క్రీన్ దూరంగా..
ఫోన్‌ను ముఖానికి మరీ దగ్గరగా పెట్టుకోవటం కళ్లకు మంచిది కాదు. కనీసం 12 అంగుళాల దూరంలో తెర ఉండాలని యాపిల్ సూచిస్తుంది. దీన్ని పాటించటానికి స్క్రీన్ డిస్టెన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ తెర ముఖానికి మరీ దగ్గరికి వచ్చినప్పుడిది హెచ్చరిస్తుంది. తగినంత దూరానికి జరిపితే గానీ ఫోన్‌ను వాడటం కుదరదు. సెటింగ్స్ ద్వారా స్క్రీన్ టైమ్‌ను తాకితే స్క్రీన్ డిస్టెన్స్ ఫీచర్ కనిపిస్తుంది. బటన్‌ను ఆన్ చేసుకుంటే ఎనేబుల్ అవుతుంది.
సురక్షిత ప్రయాణానికి చెక్-ఇన్
మరో మంచి ఫీచర్ చెక్-ఇన్. ఇది స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మనం ఎక్కడున్నామో తెలియజేస్తుంది. ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్టు చెప్పటం మరచిపోయిన సందర్భాల్లో ఇదెంతగానో ఉపయోగపడుతుంది. లైవ్ లొకేషన్ షేర్ చేయొద్దని అనుకునేవారికిది మంచి సదుపాయం. ప్రయాణం ఆరంభించినప్పుడు, ముగిసిన తర్వాత నోటిఫికేషన్ అందిస్తుంది. ఏవైనా చిక్కుల్లో ఉన్నప్పుడూ సమాచారం అందజేస్తుంది. అయితే అవతలి వారి ఫోన్ కూడా ఏఓఎస్ 17 వర్షన్ కలిగుండాలి. దీన్ని వాడుకోవాలంటే ముందుగా మనం ఎక్కుడున్నామో తెలపాలని కోరుకునేవారి కన్వర్జేషన్‌ను ఓపెన్ చేయాలి. మెసేజ్ ఫీల్డ్ పక్కనుండే ప్లస్ గుర్తు ద్వారా మోర్‌లోకి వెళ్తే చెక్-ఇన్ ఫీచర్ కనిపిస్తుంది. ఇందులో లిమిటెడ్, ఫుల్ డేటా షేరింగ్ ఆప్షన్లున్నాయి. లిమిటెడ్‌ను ఎంచుకుంటే తాజా లొకేషన్ మాత్రమే అవతలివారికి అందుతుంది. ఫుల్ డేటాను ఎంచుకుంటే ప్రయాణిస్తున్న మార్గం మొత్తం మ్యాప్‌లో కనిపిస్తుంది. ఐఫోన్‌ను చివరిసారి ఎప్పుడు అన్‌లాక్ చేశారు. యాపిల్ వాచ్ ఎప్పుడు తీశారో కూడా తెలిసిపోతుంది. తెలియని, కొత్త చోట్లలో ఉన్నట్టయితే వెంటనే అప్రమత్తం కావొచ్చు.
చదవొద్దు.. వింటే చాలు
ఇటీవలి కాలంలో పాడ్‌కాస్ట్‌లు బాగా ఆదరణ పొందాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఐఓఎస్ 17 (iOS 17)లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. సఫారీ బ్రౌజర్‌లో నచ్చిన కథనాలు, వెబ్‌సైట్లను చదివే పనిని సిరికి పురమాయిస్తే సరి. అదే వాటిని బిగ్గరగా వినిపించేస్తుంది. మనం ‘కష్టపడి’ చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సిరిని ఆదేశించటానికి ‘హే, సిరి’ అనాల్సిన పనిలేదు. మామూలుగా సిరి అని పిలిస్తే చాలు. అలాగే ఒకేసారి రెండు పనులనూ దీనికి అప్పగించొచ్చు. ఉదాహరణకు- ‘జిమ్‌కు వెళ్లటానికి దారి చూపించు, జిమ్ పాటలను ప్లే చెయ్యి’ అని ఒకేసారి ఆదేశించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Google Gemini: గూగుల్ జెమిని వచ్చేసింది.. ప్రత్యేకతలివే
ఏఐ మోడల్ అడ్వాన్స్డ్ వెర్షన్‌ను గూగుల్ ప్రపంచానికి పరిచయం చేసింది. గూగుల్ జెమిని పేరుతో మూడు వేరియంట్లలో దీనిని తీసుకొచ్చింది. -
Jio Prepaid Plan: జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఓటీటీ సదుపాయంతో
Jio Prepaid Plan: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా జతచేసింది. -
YouTube: యూట్యూబ్‌లో ఇక గేమ్స్.. వీరికి మాత్రమే!
YouTube: ప్రీమియం సబ్స్క్రైబర్లను సంఖ్యను పెంచుకోవటంలో భాగంగా యూట్యూబ్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
యూఎస్బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్ సంస్థ కేంద్రాన్ని కోరింది. -
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
Windows 10 update: విండోస్ 10 వాడుతున్న వారు విండోస్ 11కు అప్‌గ్రేడ్ అవ్వాలి. లేదంటే భవిష్యత్‌లో సెక్యూరిటీ అప్డేట్స్కు డబ్బులు చెల్లించాలి. -
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!
Redmi: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్మీ తన సి సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లను మూడు వేరియంట్లలో తీసుకొచ్చినట్లు పేర్కొంది. -
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్
New Sim card rule: సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇకపై పేపర్ విధానం కనుమరుగు కానుంది. -
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్‌స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
Instagram: ఫేస్బుక్, ఇన్‌స్టా మధ్య అనుసంధానానికి వీలు కల్పించిన క్రాస్ చాటింగ్ ఫీచర్‌ను తొలగించనున్నట్లు మెటా వెల్లడించింది. -
OnePlus 12: స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?
OnePlus 12: వన్‌ప్లస్ 12 ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల కానుంది. -
Tecno Spark Go: ₹6,699కే టెక్నో కొత్త మొబైల్.. 5,000mAh బ్యాటరీ, 13ఎంపీ కెమెరా
Tecno Spark Go 2024: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. స్పార్క్ గో 2024 పేరుతో కొత్త మొబైల్‌ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
Jio AirFiber: జియో ఎయిర్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ కంపెనీ డేటా బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో అదనంగా 1 టీబీ డేటా లభిస్తుంది. -
Airtel: డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Disney+ Hotstar Prepaid Plan: ఎయిర్టెల్ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Whatsapp: వాట్సప్‌లో యూజర్ నేమ్.. చాట్స్‌కు సీక్రెట్ కోడ్!
Whatsapp new features: వాట్సప్‌లో త్వరలో యూజర్ నేమ్ సదుపాయం రాబోతోంది. అలాగే ఎంపిక చేసిన చాట్స్‌ను లాక్ చేసిన వాటికి సీక్రెట్ కోడ్ పెట్టుకునే సదుపాయాన్ని వాట్సప్ తీసుకొస్తోంది. -
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
Google: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? -
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో బోట్ గేమింగ్ ఇయర్‌బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్‌తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్‌తో బోట్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్‌లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి... -
OnePlus: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ధర తగ్గింపు.. ఇప్పుడెంతంటే?
OnePlus Nord CE 3 Price Cut: జులైలో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.2,000 వరకు తగ్గించింది. -
Airtel vs Jio: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
Netflix Prepaid Plans: ప్రస్తుతం 5జీ నెట్వర్క్ని అందిస్తున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. -
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
Samsung Galaxy A05: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్‌ని లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్లో కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. -
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Mozilla Firefox: బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోండి.. ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం సూచన
మొజిల్లా ఫైర్ఫాక్స్ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ కంప్యూటర్లలో బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ సూచించింది.


తాజా వార్తలు (Latest News)
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
-
IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?
-
Social Look: కాజల్ వర్కౌట్.. ఫొటోగ్రాఫర్‌గా మారిన లావణ్యత్రిపాఠి
-
Green energy park: అదానీ గ్రీన్ ఎనర్జీ పార్క్.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..