Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు!
Bank Holidays in April ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో 11 రోజులు బ్యాంకులు పనిచేయబోవు. అయితే, పలు రాష్ట్రాల్లో ఉండే ఇతర ప్రత్యేక సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు.
Bank Holidays in April | ఇంటర్నెట్ డెస్క్: వరుస సెలవుల నేపథ్యంలో వచ్చే నెల ఏప్రిల్‌లో బ్యాంకులు (Bank Holidays) దాదాపు సగం రోజులు పనిచేయడం లేదు. శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. అలాగే 4న మహవీర్ జయంతి, 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 7న గుడ్‌ఫ్రైడే, 14న అంబేడ్కర్ జయంతి, 22న రంజాన్ నేపథ్యంలో తెలంగాణలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
అయితే, ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. మహవీర్ జయంతి రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు లేదు. మరోవైపు రెండు, నాలుగో శనివారాలైన 8, 22వ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అలాగే వచ్చే నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఇలా ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో 11 రోజులు బ్యాంకులు పనిచేయబోవు. ఇతర రాష్ట్రాల్లో స్థానిక పండగల దృష్ట్యా ఆయా తేదీల్లో మార్పులుంటాయి. అలా ఆయా రాష్ట్రాల్లో సెలవు దినాలను పరిగణనలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా వచ్చేనెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. అయితే, 15 రోజుల పాటు ఏ రాష్ట్రంలోనూ బ్యాంకులూ పనిచేయకుండా ఉండవు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: వారి జాబితాలో చేరాలంటే.. అతడు మరో ఏడాది ఇలానే ఆడాలి: కపిల్ దేవ్
-
Politics News
Rahul Gandhi: మోదీజీ దేవుడికే పాఠాలు చెప్పగలరు.. అమెరికాలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
-
General News
YS Avinash Reddy: అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
-
India News
45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించకపోతే..: అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక
-
Sports News
IPL Finals: ఆఖరి బంతికి అద్భుతం.. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఫైనల్స్ ఇవే!
-
World News
North Korea: కిమ్‌కు ఎదురుదెబ్బ.. విఫలమైన నిఘా ఉపగ్రహ ప్రయోగం..!