BSE: ఎస్‌ఎమ్‌ఈల కోసం బీఎస్‌ఈ కొత్త మార్గదర్శకాలు..

BSE: బీఎస్‌ఈ ప్రధాన బోర్డుకు మారాలనుకుంటున్న చిన్న, మధ్య తరహా సంస్థలకు కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది.

Updated : 26 Nov 2023 17:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బీఎస్‌ఈ (BSE)లోని ఎస్‌ఎమ్‌ఈ(SMEs) ప్లాట్‌ఫామ్‌ నుంచి ప్రధాన బోర్డుకు మారాలనుకుంటున్న ‘చిన్న, మధ్య తరహా సంస్థల’ కోసం బీఎస్‌ఈ కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి తాజా మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం.. బీఎస్‌ఈ ప్రధాన బోర్డుకు మారాలనుకుంటున్న ఏ సంస్థ అయినా మూడు సంవత్సరాల పాటూ ఎస్‌ఎమ్‌ఈ ఫ్లాట్‌ఫామ్‌లో ఉండాల్సి ఉంటుంది. అందులో కనీసం రెండేళ్ల పాటూ మెరుగైన నిర్వహణ లాభాలను నమోదు చేయాలి. గడిచిన రెండు సంవత్సరాల్లో సంస్థ నికర విలువ రూ.15 కోట్లుగా ఉండాలి. కంపెనీ పెయిడ్-అప్‌ మూలధనం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.25 కోట్లు ఉండాలి. అలాగే 250 మంది వాటాదారులను కలిగి ఉండాలి.

ఏడాది వ్యవధిలో టీవీఎస్‌ నుంచి వరుస ఎలక్ట్రిక్‌ టూవీలర్లు

జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) వద్ద ఎటువంటి దివాలా పిటిషన్‌ (winding-up petition) ఉండకూడదు. గత మూడు సంవత్సరాలుగా సదరు ఎస్‌ఎమ్‌ఈపై కానీ, కంపెనీ ప్రమోటర్లకు వ్యతిరేకంగా గానీ ట్రేడింగ్‌ నిలిపివేయటం వంటి నియంత్రణ చర్యలు తీసుకొని ఉండరాదు. ఈ కొత్త మార్గదర్శకాలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని బీఎస్‌ఈ ప్రకటించింది. ఇప్పటివరకు బీఎస్‌ఈ ఎస్‌ఎమ్‌ఈ కింద 464 కంపెనీలు లిస్ట్‌ అవ్వగా.. అందులో 181 సంస్థలు ప్రధాన బోర్డుకు మారాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని