Budget 2023: ఆ జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను!

Budget 2023: ఇన్సూరెన్స్‌ పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను విధించాలనే నిర్ణయం బడ్జెట్‌లో ఉన్న ప్రతికూల అంశాల్లో ఒకటని ఆర్థిక నిపుణులు నిధి మన్‌చండా అన్నారు.

Published : 01 Feb 2023 20:34 IST

దిల్లీ: వార్షిక ప్రీమియంల మొత్తం రూ.5 లక్షలు మించి ఉన్న జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని తాజా బడ్జెట్‌ (Budget 2023)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2023 ఏప్రిల్‌ 1 తర్వాత తీసుకునే పాలసీలకు మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ (Budget 2023)లో పేర్కొన్నారు.

‘యునిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల (ULIP)’కు మాత్రం ఈ నిబంధన వర్తించదని సీతారామన్‌ స్పష్టం చేశారు. అలాగే పాలసీదారుడు మరణిస్తే అందే హామీ మొత్తంపై ఇచ్చే పన్ను మినహాయింపు మీద దీని ప్రభావం ఉండబోదని తెలిపారు. ఇన్సూరెన్స్‌ పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను విధించాలనే నిర్ణయం బడ్జెట్‌లో ఉన్న ప్రతికూల అంశాల్లో ఒకటని ఫింటూలో ట్రైనింగ్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాధిపతి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ నిధి మన్‌చండా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని