ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్‌.. ఇకపై సమాధానాలు వినొచ్చు

ChatGPT: చాట్‌జీపీటీ వాడకాన్ని ఓపెన్‌ ఏఐ మరింత సులభంగా మారుస్తోంది. క్రమంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా రీడ్‌ ఏ లౌడ్‌ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Published : 05 Mar 2024 15:46 IST

ChatGPT | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) ప్లాట్‌ఫామ్‌లో ఓపెన్‌ఏఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘రీడ్‌ ఏ లౌడ్‌’ పేరిట వచ్చిన ఈ ఫీచర్‌ సమాధానాలను బయటకు పెద్దగా చదువుతుంది. ఫోన్‌ చూసి టెక్ట్స్‌ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వెబ్‌ వెర్షన్‌తో పాటు ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లోనూ ఇది అందుబాటులోకి వచ్చింది.

‘రీడ్‌ ఏ లౌడ్‌’ ఫీచర్‌ జీపీటీ-4, జీపీటీ-3.5 మోడళ్లలోనూ పనిచేస్తుంది. మొత్తం 37 భాషల్లోని టెక్ట్స్‌ను ఇది చదవగలదు. భాషను తనకు తానే గుర్తించగలుగుతుంది. మొబైల్‌ యాప్‌లలో టెక్ట్స్‌పై క్లిక్‌ చేసి పట్టుకుంటే ఆప్షన్స్‌లో ‘రీడ్‌ ఏ లౌడ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకుంటే ఫీచర్‌ యాక్టివేట్ అవుతుంది. వెబ్‌వెర్షన్‌లో చాట్‌జీపీటీ (ChatGPT) ఇచ్చే సమాధానం కింద స్పీకర్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

చాట్‌జీపీటీ (ChatGPT) వాడుకను మరింత సులభంగా మార్చటంలో భాగంగా ఓపెన్‌ఏఐ అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే వాయిస్‌తో కమాండ్లను ఇచ్చే ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో టైపింగ్‌ రానివారు సైతం ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. తాజాగా వచ్చిన ‘రీడ్‌ ఏ లౌడ్‌’తో వాటిని వినవచ్చు. ఇతర ఏఐ మోడళ్లు సైతం క్రమంగా ఈతరహా ఫీచర్లను తీసుకొస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని