Stock Market: వరుసగా మూడో రోజు.. మార్కెట్లకు లాభాలు

Stock Market Closing Bell: స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 270 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ 21,600 మార్క్‌ పైన స్థిరపడింది.

Published : 10 Jan 2024 16:05 IST

ముంబయి: వరుసగా మూడో సెషన్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock Market)కు లాభాలు దక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా వెల్లువెత్తిన కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ (Sensex) 270 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ (Nifty) 21,600 మార్క్‌ పైన స్థిరపడింది.

ఈ ఉదయం సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. 71,383.20 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 71,110.98 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీ నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 271.50 పాయింట్లు ఎగబాకి 71,657.71 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 73.90 పాయింట్ల లాభంతో 21,618.70 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి 83.04గా స్థిరపడింది.

మోదీ దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని: ముకేశ్‌ అంబానీ

సిప్లా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడగా.. ఓఎన్జీసీ, దివిస్‌ ల్యాబ్స్‌, భారత్‌ పెట్రోలియం, ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా ఫార్మా, ఐటీ, లోహ రంగ సూచీలు 0.4శాతం మేర పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని