Stock Market: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 700 పాయింట్లు డౌన్‌

Stock Market: స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 19,550 మార్క్‌ దిగువన ట్రేడ్‌ అవుతోంది.

Updated : 02 Aug 2023 12:13 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) బుధవారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ను ఫిచ్‌ తగ్గించింది. రానున్న మూడేళ్లలో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని సంకేతాలిచ్చింది. ఇది ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా మదుపర్లు సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో నేటి ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్‌ (Sensex) ఒక దశలో 700 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ (Nifty) 19,550 మార్క్‌ దిగువన ట్రేడ్‌ అవుతోంది.

50 మంది ఎగవేతలే రూ.87,295 కోట్లు

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 663 పాయింట్ల నష్టంతో 65,796 వద్ద, నిఫ్టీ 199 పాయింట్ల నష్టంతో 19,534 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీలో ఎన్టీపీసీ, హీరో మోటార్స్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆసియాలో జపాన్‌ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు కూడా నష్టాలతోనే ముగిశాయి.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూ.92.85కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ సంస్థాగత మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. అటు బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 0.85శాతం పెరిగి 85.63 డాలర్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని