4 బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుల ఏర్పాటు

గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులు నాలుగు ఏర్పాటు నిమిత్తం భెల్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), గెయిల్‌తో కోల్‌ ఇండియా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. గ్యాస్‌ఫికేషన్‌ ప్రక్రియ ద్వారా బొగ్గును సిన్‌గ్యాస్‌గా మారుస్తారు. వచ్చే ఎనిమిదేళ్లలో

Published : 24 Sep 2022 02:40 IST

భెల్, ఐఓసీ, గెయిల్‌తో కోల్‌ ఇండియా జట్టు

దిల్లీ: గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులు నాలుగు ఏర్పాటు నిమిత్తం భెల్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), గెయిల్‌తో కోల్‌ ఇండియా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. గ్యాస్‌ఫికేషన్‌ ప్రక్రియ ద్వారా బొగ్గును సిన్‌గ్యాస్‌గా మారుస్తారు. వచ్చే ఎనిమిదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు గ్యాస్‌ఫికేషన్‌ చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ముడి చమురు నుంచి కూడా సిన్‌గ్యాస్‌ను తయారు చేస్తుండటమే ఇందుకు కారణం. ప్రతిపాదిత ప్రాజెక్టుల వల్ల విదేశీ మారకపు నిల్వలు ఆదా చేయడంతో పాటు సుమారు 23,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2030కి నిర్దేశించేందుకున్న 100 మిలియన్‌ టన్నుల బొగ్గు గ్యాస్‌ఫికేషన్‌ కోసం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా మూడు దశల్లో ఈ ప్రక్రియ చేపడతామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని