ఇస్రో ప్రయోగాల్లో అనంత్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన  పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ రూపకల్పనలో, కొన్ని విడిభాగాలు సరఫరా చేయడంలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) భాగస్వామి అయింది.

Published : 27 Nov 2022 06:54 IST

పీఎస్‌ఎల్‌వీ సీ-54కు కీలక విడిభాగాల సరఫరా  

ఈనాడు, హైదరాబాద్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన  పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ రూపకల్పనలో, కొన్ని విడిభాగాలు సరఫరా చేయడంలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) భాగస్వామి అయింది. ఏటీఎల్‌కు చెందిన తిరువనంతపురం, బెంగళూరు యూనిట్లు   ఫ్లైట్‌ సిస్టమ్స్‌, ఏవియానిక్స్‌ ప్యాకేజీలు అందించడంతో పాటు రాకెట్‌ రూపకల్పన, టెస్టింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ డాక్టర్‌ సుబ్బారావు పావులూరి వెల్లడించారు. ఫ్లైట్‌ సిస్టమ్స్‌ సబ్‌-అసెంబ్లీ బాధ్యతలను తమ తిరువనంతపురం యూనిట్‌ నిర్వహించిందని, ఈఓఎస్‌-06 (ఓషియన్‌శాట్‌-3) కు ఎంతో కీలకమైన ఏవియానిక్స్‌ సిస్టమ్స్‌ను బెంగళూరు యూనిట్‌ సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు. అనంత్‌ టెక్నాలజీస్‌ ఎన్నో ఏళ్లుగా ఇస్రోతో కలిసి పనిచేస్తోంది. ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) తో ఈ సంస్థకు దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. ఎటువంటి లోపాలకు తావులేకుండా ఇప్పటి వరకు ఇస్రో నిర్వహించిన  71 రాకెట్‌ ప్రయోగాలు, 91 అంతరిక్ష ప్రయోగాల్లో అనంత్‌ టెక్నాలజీస్‌ పాలుపంచుకున్నట్లు డాక్టర్‌ పావులూరి వెల్లడించారు. తమకు అమెరికా, ఐరోపా దేశాల్లోని అగ్రగామి అంతరిక్ష తయారీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నందున, అంతరిక్ష పరిశ్రమలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని