వినియోగ కార్ల వ్యాపారంలోకి కియా

కియా ఇండియా వినియోగ (సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ -సీపీఓ) కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. దీని కోసం దేశవ్యాప్తంగా 30 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

Published : 30 Nov 2022 02:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: కియా ఇండియా వినియోగ (సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ -సీపీఓ) కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. దీని కోసం దేశవ్యాప్తంగా 30 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే దేశంలోని 14 నగరాల్లో 15 విక్రయ కేంద్రాలను నెలకొల్పగా, ఈ సంఖ్యను ఇంకా పెంచుకోనుంది. నూతన వ్యాపారం ద్వారా కార్ల వినియోగదార్లకు సరికొత్త అనుభూతిని అందుబాటులోకి తెస్తామని సంస్థ ముఖ్య విక్రయాల అధికారి యంగ్‌ సిక్‌ సోన్‌ పేర్కొన్నారు. ప్రీ-ఓన్డ్‌ కార్లకు సంబంధించి వినియోగదార్లకు పరిమిత సమాచారమే అందుబాటులో ఉంటోందని, దీనికి భిన్నంగా తమ కొనదలచిన కార్లపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు కియా సీపీఓ ప్రయత్నిస్తుందని అన్నారు. కార్ల కొనుగోలు, విక్రయాలు, మార్పిడి సేవలను తాము అందిస్తామని తెలిపారు. కియా ఇండియా మనదేశంలో విడుదల చేసిన మోడల్‌ కార్లు ప్రస్తుతం ‘రిప్లేస్‌మెంట్‌ వయస్సు’ స్థాయికి చేరుకుంటున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ కార్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. తమ దగ్గర కొత్త కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో మూడో వంతు మంది తమ పాత కార్లను మారుస్తున్నారని, అటువంటి వారికి మెరుగైన సేవలు అందించేందుకే ఈ కొత్త వ్యాపారాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు