చైనా ఎగుమతుల్లో భారీ క్షీణత

నవంబరు చైనా ఎగుమతులు, దిగుమతుల్లో క్షీణత నమోదైంది. దేశీయంగా కొవిడ్‌ ఆంక్షలకు తోడు బలహీన అంతర్జాతీయ గిరాకీ ఇందుకు కారణమయ్యాయి.

Published : 08 Dec 2022 02:39 IST

బీజింగ్‌: నవంబరు చైనా ఎగుమతులు, దిగుమతుల్లో క్షీణత నమోదైంది. దేశీయంగా కొవిడ్‌ ఆంక్షలకు తోడు బలహీన అంతర్జాతీయ గిరాకీ ఇందుకు కారణమయ్యాయి. చైనా కస్టమ్స్‌ గణాంకాల ప్రకారం నవంబరులో ఎగుమతులు 9 శాతం తగ్గి 296.1 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. అక్టోబరులో నమోదైన 0.9 శాతం క్షీణతతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దిగుమతులు అక్టోబరులో 0.7 శాతం తగ్గగా, నవంబరులో 10.9 శాతం క్షీణించి 226.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఇవి సూచిస్తున్నాయి. ఇక వాణిజ్య లోటు 2.5 శాతం తగ్గి 69.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సహా పలు ఐరోపా, ఆసియా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచిన తర్వాత అంతర్జాతీయ గిరాకీ బలహీనపడింది. చైనా చేపట్టిన ‘జీరో-కొవిడ్‌’ విధానం వల్ల దేశీయ గిరాకీ కూడా దెబ్బతింది. కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వ్యాపారాలు డీలాపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని