రెపో రేటు మరో పావు శాతం పెరగొచ్చు: ఉదయ్‌ కోటక్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చిన నేపథ్యంలో, త్వరలోనే మరో పావు శాతం పెరిగే అవకాశం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 09 Dec 2022 04:17 IST

దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చిన నేపథ్యంలో, త్వరలోనే మరో పావు శాతం పెరిగే అవకాశం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 6 శాతానికి పైనే నమోదవుతున్న ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత శ్రేణికి (2-6 శాతం) తీసుకురావడానికి ఈ పెంపు అనివార్యమని సీఐఐ గ్లోబల్‌ ఎకనామిక్‌ పాలసీ సమ్మిట్‌ 2022 కార్యక్రమంలో ఆయన తెలిపారు. ‘ఇవాళ పరిస్థితులను గమనిస్తే రెపో రేటు సుమారు 6.5 శాతానికి చేరే అవకాశం ఉంది. ఈ నెలలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కూడా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంక్‌లకు దిశానిర్దేశం సూచిస్తుంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే ఆర్‌బీఐ నుంచి మరో 25 బేసిస్‌ పాయింట్ల పెంపు తప్పద’ని ఆయన విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని