బీపీ, షుగర్‌ మందుల ధరలు ఖరారు

అధిక రక్త పోటు(బీపీ), మధుమేహం(షుగర్‌) సహా పలు వ్యాధుల చికిత్సలో వాడే 23 ఔషధ ఫార్ములేషన్ల రిటైల్‌ ధరలను ఖరారు చేసినట్లు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఏ వెల్లడించింది.

Published : 10 Jun 2023 02:39 IST

మొత్తం 23 ఔషధ ఫార్ములేషన్ల రిటైల్‌ ధరల వెల్లడి

దిల్లీ: అధిక రక్త పోటు(బీపీ), మధుమేహం(షుగర్‌) సహా పలు వ్యాధుల చికిత్సలో వాడే 23 ఔషధ ఫార్ములేషన్ల రిటైల్‌ ధరలను ఖరారు చేసినట్లు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఏ వెల్లడించింది. మే 26న జరిగిన 113వ అధారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వీటిని ఖరారు చేశారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. మధుమేహ ఔషధం గ్లిక్లాజైడ్‌ ఈఆర్‌, మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఒక్కో మాత్ర ధరను రూ.10.03గా నిర్ణయించారు. అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే టెల్మిసార్టన్‌, క్లోర్‌థాలిడన్‌, సిల్నిడిపిన్‌ ఒక్క మాత్ర ధర రూ.13.17గా ఉంది. నొప్పి నివారణలో వాడే ట్రైప్సిన్‌, బ్రోమెలాయిన్‌, రుటోసైడ్‌ ట్రైహైడ్రేట్‌, డైక్లోఫెనాక్‌ సోడియం మాత్రను రూ.20.51గా ఖరారు చేశారు. 2013 ఔషధ ధరల నియంత్రణ ఆదేశాల కింద 15 షెడ్యూల్డ్‌ ఫార్ములేషన్ల ధరలను ఎన్‌పీపీఏ సవరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని