Hyderabad: ‘మెర్సిడెస్‌ బెంజ్‌’పై మహిళల మోజు.. హైదరాబాద్‌లో 30 శాతం కొనుగోలుదార్లు వాళ్లే

విద్యుత్తు మోడళ్ల అమ్మకాలపై విలాసకార్ల సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ ఆసక్తిగా ఉంది. వచ్చే ఏడాది- ఏడాదిన్నరలో 3- 4 విద్యుత్తు కార్లు (ఈవీ) తీసుకువస్తామని  మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ వెల్లడించారు.

Updated : 18 Aug 2023 08:34 IST

హైదరాబాద్‌ (ఖైరతాబాద్‌), న్యూస్‌టుడే: విద్యుత్తు మోడళ్ల అమ్మకాలపై విలాసకార్ల సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ ఆసక్తిగా ఉంది. వచ్చే ఏడాది- ఏడాదిన్నరలో 3- 4 విద్యుత్తు కార్లు (ఈవీ) తీసుకువస్తామని  మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ వెల్లడించారు. మూడేళ్లలో తాము విక్రయించే కార్లలో నాలుగో వంతు విద్యుత్తు కార్లే ఉంటాయని అన్నారు. అత్యధికంగా అమ్ముడవుతున్న మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌సీ కార్లను గురువారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు. జీఎల్‌సీ 300 ధర రూ.73.5 లక్షలు కాగా, జీఎల్‌సీ 220డి ధర రూ.74.5 లక్షలు (ఎక్స్‌ షోరూం). పెట్రోలు, డీజిల్‌ ఇంజన్లతో ఈ ఎస్‌యూవీలో రెండో తరం ఇంటిగ్రేటెడ్‌ స్టార్టర్‌ జనరేటర్‌ సిస్టమ్‌, 48 వోల్ట్‌ మైల్డ్‌ హై‌్రబ్రిడ్‌ సిస్టమ్‌తో శక్తిమంత టర్బోఛార్జ్‌, ఎంబీయూఎక్స్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి ప్రత్యేకతలున్నాయి.   దేశవ్యాప్తంగా వీటికి 1500 బుకింగ్‌లు రాగా, ఇందులో 8% హైదరాబాద్‌ నుంచి జరిగాయి. హైదరాబాద్‌ తమకు ముఖ్యమైన మార్కెట్‌ అని, ఇక్కడ మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు కొనుగోలు చేసే వారిలో 30% మంది మహిళలు ఉండటం ప్రత్యేకతగా సంతోష్‌ వివరించారు. 2022 అమ్మకాలతో పోలిస్తే, 2023లో రెండంకెల వృద్ధి సాధించగలమని అంచనా వేశారు. తమ పుణె ప్లాంటులో ప్రస్తుతం ఏటా 20,000 కార్లు ఉత్పత్తి చేస్తుండగా, ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. ఈ ప్లాంటుపై ఇప్పటికి రూ.2700 కోట్ల పెట్టుబడి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని