చిన్న కంపెనీలపై ఆసక్తి ఉంటే..

మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం పేరు ‘మహీంద్రా మనులైఫ్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌’. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం.

Published : 25 Nov 2022 00:09 IST

హీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం పేరు ‘మహీంద్రా మనులైఫ్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌’. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ప్రధానంగా స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లలో ఇది మదుపు చేస్తుంది. దీర్ఘకాలంలో తమ పెట్టుబడులపై అధిక ప్రతిఫలం కావాలని ఆశించే వారికి ఈ తరహా పథకాలు అనుకూలంగా ఉంటాయి. మహీంద్రా మనులైఫ్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ వచ్చే నెల 5. డిసెంబరు 14 నుంచి తిరిగి యూనిట్ల క్రయ విక్రయాలు ప్రారంభం అవుతాయి. ఎన్‌ఎఫ్‌ఓ ద్వారా కనీస పెట్టుబడి రూ.1,000. ఈ పథకానికి అభినవ్‌ ఖండేల్వాల్‌, మనీష్‌ లోథా ఫండ్‌ మేనేజర్లు.

రాబోయే రోజుల్లో మనదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీలకు వ్యాపార అవకాశాలు అధికంగా లభించి, మిడ్‌ క్యాప్‌ లేదా లార్జ్‌ క్యాప్‌ తరగతికి చేరే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడి ఎంతో లాభదాయకంగా మారుతుంది. అందువల్ల స్మాల్‌ క్యాప్‌ పథకాలపై పెట్టుబడిని మదుపరులు పరిశీలించవచ్చని మార్కెట్‌ నిపుణుల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని