ఇండెల్‌ మనీ.. ఎన్‌సీడీలు

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఇండెల్‌ మనీ నుంచి సెక్యూర్డ్‌, రిడీమబుల్‌ నాన్‌ కన్వర్టిబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ) అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 12 వరకూ ఈ ఇష్యూ అందుబాటులో ఉండనుంది.

Published : 02 Feb 2024 00:09 IST

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఇండెల్‌ మనీ నుంచి సెక్యూర్డ్‌, రిడీమబుల్‌ నాన్‌ కన్వర్టిబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ) అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 12 వరకూ ఈ ఇష్యూ అందుబాటులో ఉండనుంది. ఒక్కో ఎన్‌సీడీ ముఖ విలువ రూ.1,000. కనీసం 10 ఎన్‌సీడీలకు దరఖాస్తు చేసుకోవాలి. వీటి కాల వ్యవధి 366 రోజుల నుంచి 72 నెలల వరకూ ఉంటుంది. ప్రాథమిక ఇష్యూ రూ.100 కోట్లు. మరో రూ.100 కోట్లను అదనంగా స్వీకరించేలా దీన్ని తీసుకొచ్చింది. బంగారంపై హామీతో కూడిన రుణాలను ఇచ్చేందుకు, ఇతర ఖర్చులు, విస్తరణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కూపన్‌ రేటును 12.25 శాతంగా నిర్ణయించినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని