విభిన్న పథకాల్లో

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఒక మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ను రూపొందించింది. నష్టభయాన్ని తగ్గించుకోవడం, అన్ని రకాలైన పెట్టుబడి సాధనాల్లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం ఈ పథకం ప్రధాన వ్యూహం.

Updated : 09 Feb 2024 05:25 IST

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఒక మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ను రూపొందించింది. నష్టభయాన్ని తగ్గించుకోవడం, అన్ని రకాలైన పెట్టుబడి సాధనాల్లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ఇది హైబ్రీడ్‌- మల్టీ అసెట్‌ అలకేషన్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 21. కనీస పెట్టుబడి రూ.5,000. ఈక్విటీ షేర్లతోపాటు రుణ పత్రాలు, గోల్డ్‌ ఈటీఎఫ్‌, రీట్స్‌, ఇన్విట్‌.. తదితర పెట్టుబడి సాధనాల్లో ఈ పథకం మదుపు చేస్తుంది. తమ పెట్టుబడుల విలువలో హెచ్చుతగ్గులు తక్కువగా ఉండి, అన్ని రకాలైన పెట్టుబడి సాధనాల్లో వైవిధ్యంగా మదుపు చేయాలని కోరుకునే మదుపరులకు మల్టీ అసెట్‌ అలకేషన్‌ పథకాలు అనువుగా ఉంటాయి. తక్కువ నష్టభయంతో స్థిరమైన లాభాలు ఆర్జించే అవకాశాలూ అధికంగా ఉంటాయి.


మిడ్‌క్యాప్‌ ఈటీఎఫ్‌

ధ్యస్థాయి కంపెనీల్లో మదుపు చేసే లక్ష్యంతో ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఈటీఎఫ్‌ అందుబాటులోకి తెచ్చింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 12తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 టీఆర్‌ఐ సూచీ ప్రామాణికంగా ఈ ఫండ్‌ పనిచేస్తుంది. స్థూల ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగున్నప్పుడు మిడ్‌క్యాప్‌ షేర్లు లాభాలను అందించే అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ రవి కుమార్‌ ఝా పేర్కొన్నారు.


ఇంధన రంగంలో

ఇంధన రంగంలో అందివస్తున్న కొత్త అవకాశాలను గుర్తించి ఒక వినూత్నమైన పథకాన్ని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఎస్‌బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 20. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ)లో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది సెక్టోరియల్‌/థీమ్యాటిక్‌ విభాగానికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ప్రధానంగా ఇంధనం, విద్యుత్తు ఉత్పత్తి, రవాణా, పంపిణీ తదితర కార్యకలాపాల్లో నిమగ్నమైన మంచి కంపెనీలను గుర్తించి పెట్టుబడి పెడుతుంది. తద్వారా స్థిరమైన లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీర్ఘకాలిక మదుపరులకు అనుకూలంగా ఉంటుంది.


పెద్ద, మధ్యస్థాయి కంపెనీల్లో

జాజ్‌ ఫిన్‌సర్వ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ అనే నూతన పథకం అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లలో పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 20. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ 250 టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు.


సూచీ షేర్లలో మదుపు

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక ఇండెక్స్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. యాక్సిస్‌ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 22. కనీస పెట్టుబడి రూ.500. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐ ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. నేటి పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు యాక్సిస్‌ ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ బి.గోప్‌కుమార్‌ తెలిపారు. మార్కెట్‌ వృద్ధిని పరిగణనలోకి తీసుకొని పెట్టుబడులు పెట్టే దీర్ఘకాలిక మదుపరులకు ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని