విద్యుత్ ద్విచక్ర వాహనాలపై రాయితీ తగ్గింపు
విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1 నుంచి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. కిలోవాట్‌అవర్ (కేడబ్ల్యూహెచ్)కు సబ్సిడీని రూ.5,000 మేర తగ్గించనున్నట్లు భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ పేర్కొంది.
కిలోవాట్‌అవర్‌కు రూ.5000 మేర కోత
జూన్ 1 నుంచి అమల్లోకి: నోటిఫికేషన్
దిల్లీ: విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1 నుంచి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. కిలోవాట్‌అవర్ (కేడబ్ల్యూహెచ్)కు సబ్సిడీని రూ.5,000 మేర తగ్గించనున్నట్లు భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండో దశ(ఫేమ్-2) కింద వాహన తయారీదార్లకు కేడబ్ల్యూహెచ్‌కు రూ.15,000 వరకు ప్రభుత్వం సబ్సిడీనందిస్తోంది. దీన్ని రూ.10,000కు తగ్గించనున్నారు. ఈ వాహనాల కొనుగోలుకు ఇచ్చే ప్రోత్సాహకాలకు, ప్రస్తుతం వాహన వ్యయంలో 40% వరకు పరిమితి ఉండగా.. ఇకపై ఆ పరిమితిని వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి తగ్గించనున్నారు. సవరించిన సబ్సిడీ 2023 జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అన్ని విద్యుత్ ద్విచక్రవాహనాలకు వర్తిస్తుందని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. దేశంలో విద్యుత్ వాహనాల తయారీ, విక్రయాలకు ఊతమివ్వడం కోసం ఈ పథకాన్ని 2019 జూన్‌లో ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
లైఫ్ జాకెట్ లేకుండానే 15 కి.మీ. ఈత
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!